
Prajapalana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రజాపాలన నిర్వహించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు తీసుకుంది. ఈ సమయంలో దరఖాస్తు చేయని వారి కోసం ఇంకా సమయం కూడా కేటాయించారు. దీంతో ఎవరైనా దరఖాస్తు చేయలేని వారు కూడా తరువాత చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. దీనికి ప్రత్యేకంగా సమయం కూడా ఇవ్వనుంది.
ఆరు గ్యారంటీల అమలుకు ఈ దరఖాస్తు ప్రామాణికం కానుంది. దీంతో తొలివిడతలో దరఖాస్తు చేయకుండా మిగిలిపోయిన వారి కోసం సర్కారు మరో అవకాశం కల్పించనుంది. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతరం తీసుకునే ప్రక్రియగా పేర్కొంది. మండల తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించడానికి ప్రత్యేకంగా ఓ కౌంటర్ ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేయడానికి వచ్చిన వారి దరఖాస్తులు తీసుకుని వారికి రశీదు ఇస్తారు. ఇలా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ పాలన సాగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకుంది. ఏనాడు కూడా బీఆర్ఎస్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నిరంతరం ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఐదేళ్లలో ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల అవసరాలు తీర్చాలని చూస్తోంది. దీని కోసమే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. విడతల వారీగా పథకాల అమలుకు శ్రీకారం చుట్టనుంది. బడ్జెట్ లేకపోవడంతో ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తోంది. నిధులు నిండుకోవడంతో ఎటు తేల్చుకోలేకపోతోంది. ఈనేపథ్యంలో నిధులు సమకూర్చుకుని ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.