V Hanumanta Rao : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదని ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ అవేదన వ్యక్తం చేశారు. తనకు ఎందుకు ఎంపీగా అవకాశం ఇవ్వలేదని అయన ప్రశ్నిoచారు. నాపేరును లిస్టులో లేకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనపై ఎందుకు ఇంత కక్ష గట్టారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే కింది స్థాయి నుండి ఈ స్థాయి కి వచ్చాను అని వీహెచ్ అన్నారు.
నాకేమీ వయసు ఐపోలేదని నేను చురుగ్గా తిరిగే సత్తానాకు ఉందన్నారు. పార్టీలో ఉండి పార్టీకోసం కష్టపడుతున్న నాకు ఎంపీ టికెట్ ఇస్తే కచ్ఛితంగా గెలుస్తానని ఆయన అన్నారు.