37.7 C
India
Saturday, May 18, 2024
More

    BJP Party : సలహాదారుల నియామకంలో డబుల్ రోల్.. ఢిల్లీకి ఒకలా.. ఏపీకి మరోలా రూల్

    Date:

    BJP Party :  పాలనలో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు సలహాదారులను నియమించుకుంటాయి. ఆయా రంగాల్లో నిపుణులైన వారిని ఇలా సలహాదారుల నియమించుకుంటూ వారి సేవలను నియమించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇటీవల పలు రాష్ర్ట ప్రభుత్వాల తీరు పరిధి దాటింది. సలహాదారుల పేరిట తమ అనుచరులు, కావాల్సిన వారికి అవకాశం ఇస్తున్నారు. సలహాదారుల సంఖ్య ఏకంగా వందలు దాటుతున్నది. పలుమార్లు న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అడ్డూ అదుపు లేకుండా సలహాదారలను నియమించుకుంటున్నారు. ప్రజా సొమ్మును వారికి జీతాల పేరిట లక్షల్లో చెల్లిస్తూ దుర్వినియోగం చేస్తున్నారు.

    అయితే ఢిల్లీ ప్రభుత్వం సలహాదారులు, కన్సల్టెంట్స్ గా నియమించుకున్న 400 మందిని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా తొలగించారు. ప్రభుత్వంలోని 23 శాఖల్లో వీరంతా పాలనలో వేలు పెడుతున్నట్లుగా గుర్తించారు. నిపుణులంటూ వీరందరినీ నియమించుకోవడాన్ని ఆక్షేపించింది. ఫెలోస్, అసోసియేట్ ఫెలోస్, సలహాదారులు, డిప్యూటీ సలహాదారులు, పరిశోధకులు, నిపుణులు అంటూ పదవులు సృష్టించి ఐనవారికి బాధ్యతలు అప్పగించడంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. వెంటనే వారిని తొలగిస్తూ ఎల్జీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

    అయితే సలహాదారుల నియామకం అంటేనే ఠక్కున గుర్తొచ్చేది ఏపీ. టెన్త్ ఫెయిల్ అయిన వారిని కూడా ఏపీ సీఎం జగన్ సలహాదారులుగా నియమించుకున్నారని ప్రచారం జరిగింది. సలహాదారులంటూ లక్షల్లో జీతం, అలవెన్సులు కార్యాలయాల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం పై ఆరోపణలు ఉన్నాయి. న్యాయస్థానంలో కేసులు వేసిన తర్వాత జగన్ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. న్యాయస్థానం సీరియస్ అవడంతో  ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులు ఉంటారని చెబుతూ సంజాయిషీ ఇచ్చింది.

    సంబంధింత మంత్రులకు సలహాదారులుగా రీడిజిగ్నేట్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో పాటు వారి పాత్ర, బాధ్యతలను కూడా వెల్లడిస్తామని పేర్కొంది. పలు అంశాలపై విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలివ్వడానికే సలహాదారుల బాధ్యతగా చెప్పుకొచ్చింది. సివిల్ సర్వెంట్స్ రోజువారీ విధుల్లో వారి జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే ఢిల్లీలో పనికి రాని సలహాదారులు.. మరి ఏపీ లో ఎందుకనే వాదన వినిపిస్తు్న్నది. అక్కడి వారిపై ఎల్జీ చేసినట్లుగా ఉత్తర్వులు ఏపీలో గవర్నర్ ఎందుకు చేయడం లేదో అర్థం కావట్లేదనే చర్చ కొనసాగుతున్నది. ఏదేమైనా పాలకులు చేసిందే చట్టం.. చెప్పిందే న్యాయం అనేలా ప్రస్తుతం అధికారం అనుభవిస్తున్నారు. చివరకు ప్రజలకే కష్టం. ఎందుకంటే సలహాదారులకు చెల్లించే సొమ్మంతా ప్రజలదే కదా.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    బండి పదవీ పోవడానికి కారణం కేసిఆర్ఃమంత్రి పోన్నం

    మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే కరీంనగర్ MPబండి సంజయ్ కుమార్ ను...

    Manda Krishna Madiga : వరంగల్ ఎంపీ బరిలో మంద కృష్ణ మాదిగ.. ఆ వర్గాలను ఆకర్షించేందుకు బీజేపీ బిగ్ ప్లాన్!

    Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు...

    Modi Achievements : 10ఏండ్లలో కాంగ్రెస్ కంటే మోడీ సాధించిన ఘనతలు ఇవీ!

    Modi Achievements : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2014లో...