29.3 C
India
Tuesday, February 10, 2026
More

    CM YSJagan : బ్యాన్ చేసినా బంపరాఫర్.. టాప్ లో ఏబీఎన్.. జగనే కారణమా..!

    Date:

     

    AP GOvernment
    AP GOvernment

    CM YSJagan : కొందరు చెడు చేయాలని ప్రయత్నించినా.. మంచే జరుగుతుందనడానికి ఇదొక నిదర్శనం. తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వాలతో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా ఢీ కొడుతున్నది ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక. అయితే ఏపీలో ఈ చానల్ పై జగన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తుందనే కారణంతో దానిని తొక్కి పెట్టారు. ఇక పత్రిక కు యాడ్స్ కూడా ఇవ్వడం లేదు. అయితే ఇక్కడే ఏబీఎన్ కు మంచి జరిగినట్లుగా కనిపిస్తున్నది.

    ఏబీఎన్ చానల్ ఇప్పుడు యూ ట్యూబ్ లో జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో కేబుల్ ఛానళ్లలో ఆ ఛానల్ ను రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఎక్కువ మంది యూ ట్యూబ్ లలో ఈ చానల్ ను చూస్తున్నారు. ఇండియా న్యూస్ చానల్స్ రేటింగ్స్ లో ఫోన్లలో యూట్యూబ్ ద్వారా ఎక్కువగా చూస్తున్న చానళ్లలో ఏబీఎన్ ఉంది. జీ న్యూస్, అజ్ తక్,  టీవీ 9 మరాఠీ తర్వాత ఏబీఎన్ నాలుగో స్థానంలో ఉంది. కానీ వివేకా కేసు పరిణామాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు కేవలం ఏబీఎన్ మాత్రమే ప్రసారం చేస్తుందనేది అందరికీ తెలిసిందే. దీంతో యూ ట్యూబ్ ద్వారా ఏబీఎన్ ను చూస్తున్నారు.
    అయితే అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో ఏబీఎన్ కు యాడ్లు నిలిపివేశారు. ఇక ఏపీలో పూర్తిగా బ్యాన్ చేశారు. దీంతో సీఎం జగన్ సాధించిందేమి లేదు. అందుకే ఇంకా ఆయన ఇబ్బందులు పెట్టడంతో పాటు పదే పదే బహిరంగ సభల్లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలను విమర్శిస్తూ ఉంటారు.  అయితే దీనిపై ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. సీఎం కూడా ఏబీఎన్ చానల్ చూస్తారని, అందుకే ఆయనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు తెలుస్తున్నాయని పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా జగన్ తొక్కి పెట్టాలనుకున్నా , ఏబీఎన్ కు మేలే జరిగిందనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    ఏపీలో టీడీపీకి కొంత అనుకూలంగా కథనాలను ఏబీఎన్ ప్రసారం చేస్తుంటుంది. అయితే తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా పోరాడుతున్నదనే మంచి అభిప్రాయం మెజార్టీ మేధావుల్ల ఉంది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రసారాలు, కథనాలను బహిరంగంగా సమర్థించుకున్నా, అందరూ ఇదే కరెక్ట్ విధానమని కొనియాడుతున్నారు. జర్నలిజం ఒకరి పక్షాన కాకుండా, ఇలా ప్రజల పక్షాన ఉండాలని చెబుతున్నారు. అయితే టీడీపీ కి ఎక్కువ అనుకూల వార్తలు ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఏదేమైనా ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్లడం గొప్పతనమేనని అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Government : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్.. చరిత్రలోనే తొలిసారి

    AP Government : ఏపీ బడ్జెట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం...

    AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

    AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

    YCP Govt : విద్యార్థుల తల్లులకు నోటీసులు పంపిన వైసీపీ ప్రభుత్వం

    YCP Govt : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆపద్ధర్మ వైసీపీ ప్రభుత్వం...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...