Tamanna ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో డైమండ్ రింగ్ టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.. టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకి డైమండ్ రింగ్ ఇచ్చిందంటూ నెట్టింట న్యూస్ వైరల్ అయ్యింది.. మెగా కోడలు ఉపాసన కొణిదెల టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు డైమండ్ రింగ్ ఇచ్చింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..
మరి ఈ విషయంలో చాలా రోజులుగా కన్ఫ్యూజన్ నెలకొని ఉంది.. తాజాగా క్లారిటీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ.. తమన్నా ఈ మధ్య తరచు వార్తల్లో నిలుస్తూనే ఉంది.. ఈమె వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది.. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ లలో నటించి నిత్యం వార్తల్లో నిలుస్తుంది..
ఇదిలా ఉందా ఉపాసన తమన్నాకు డైమండ్ రింగ్ ఇచ్చింది అంటూ టాక్ వినిపిస్తుండగా ఈమె ఎందుకు ఇస్తుంది అని నెట్టింట జోరుగా కామెంట్స్ చేసుకుంటున్నారు.. రెండు కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ ఆమెకు ఎందుకు ఇచ్చిందా అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే తమన్నా క్లారిటీ ఇచ్చింది.
తనకు ఉపాసన 2 కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ ఇచ్చిందన్న వార్తలు హైలెట్ అవుతున్న నేపథ్యంలో మాట్లాడిన బ్యూటీ అసలు నాకు ఎవరు కూడా ఎలాంటి విలువైన డైమండ్ రింగ్ ఇవ్వలేదని నా వేలుకి పెట్టుకుంది డైమండ్ రింగ్ కాదు అది సోడా బాటిల్ ఓపెనర్ అంటూ అసలు విషయం బయటకు చెప్పడంతో ఈ విషయానికి చెక్ పెట్టాడు..