
Tollywood drug case : ప్రస్తుతం డ్రగ్స్ కేసు సంచలనం కలిగిస్తోంది. చిత్ర పరిశ్రమలో చీకటి బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జూదం, వ్యభిచారం, డ్రగ్స్ వంటి కేసులు అందరిని భయపెడుతున్నాయి. డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పలుమార్లు డ్రగ్స్ కేసులు బయట పడ్డాయి. అదే కోవలో ఇప్పుడు కూడా డ్రగ్స్ కేసు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. దీంతో వారిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు.
చాలా ఏళ్లుగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. పలువురు హీరోహీరోయిన్లు, దర్శకులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖుల పేర్లు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. 2018లో కాల్విన్ అనే డ్రగ్ పెడ్లర్ అరెస్టు అయ్యాడు. అప్పుడే పూరీ జగన్నాథ్, రవితేజ, నవదీప్ వంటి వారి పేర్లు బయటకు వచ్చాయి. ఆ కేసును కూడా మధ్యలోనే వదిలేశారు.
ఈ కేసులో హీరోయిన్ చార్మి, ఐటమ్ బాంబ్ చార్మి కౌర్ లపై కూడా ఆరోపణలు వచ్చాయి. విచారణకు కూడా హాజరయ్యారు. సంజన, రాగిణి జైలు శిక్ష కూడా అనుభవించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా డ్రగ్స్ కేసులోనే ఆత్మహత్య చేసుకున్నట్ల అప్పట్లో కలకలం రేగింది. ఈ కేసు విచారణ పలు మలుపులు తిరిగినా చివరకు ఏం తేలలేదు. ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా కొద్దిరోజులకు మరిచిపోతారని అంటున్నారు.
కేసు రాజకీయ కోణాల్లోకి వెళ్తుండటంతో ముందుకు సాగదు. కీలక నిందితులు తమ పరపతి ఉపయోగించుకుని బయట పడటం మామూలే. ఈ నేపథ్యంలో ఎన్ని కేసులు వచ్చినా ఇలాగే పోతాయి. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా డ్రగ్స్ కు సంబంధించిన కేసులు వెలుగు చూస్తున్నా కేసులు మాత్రం పరిష్కారం కావడం లేదు. నిందితులకు శిక్ష పడటం లేదు. అందుకే మూడు పువ్వులు ఆరు కాయలుగా డ్రగ్స్ మాఫియా తులతూగుతోంది.