
KP Chaudhary kisses with that character artist : సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. భారీ ఎత్తున్న డ్రగ్స్ తో పట్టుబడిన ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఫోన్ లో చాలా మంది సెలబ్రెటీలు, వారి పిల్లల నెంబర్లు కనిపించాయి. ఇటు సినీ ప్రముఖలే కాకుండా రాజకీయ నాయకుల పిల్లలు వారి కుటుంబాలకు చెందిన వారి వివరాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఈ కేసులో కేపీ చౌదరి ప్రధాన నిందితుడు కాగా ఆయనను విచారిస్తే అషురెడ్డి పేరు బయటకు వచ్చింది. పోలసులు అరెస్ట్ చేసే సమయం కంటే కొన్ని గంటల ముందు అషురెడ్డికి చౌదరి చాలా సార్లు ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడు.? ఏమై ఉంటుంది.? ఈ కేసుకు ఆమెకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి చెందిన మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి. ఈ కేసులో ఆమె పాత్రపై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సురేఖా వాణి తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేసింది.
చాలా రోజులుగా ఈ కేసులో తన పేరు వినిపిస్తుండడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి స్పందించారు. తనకు ఒక కుటుంబం ఉందని, ఒక బిడ్డ ఉందని చెప్పుకచ్చింది. కెరీర్, కుటుంబం నాశనం అవుతుందని తనను ఇందులోకి సోషల్ మీడియా లాగుతుందని అలా చేయద్దని ప్రాధేయపడింది. ఒక నిర్మాతగా ఆయనను కలిసిన మాట వాస్తవమే కాని డ్రగ్స్ కు అందుకు సంబంధం లేదని చెప్పింది. ఆయన ఒక ప్రొడ్యూసర్ కాబట్టి అప్పుడప్పుడూ కలవాల్సి వచ్చిందని చెప్పింది సురేఖా వాణి.
అయితే ఆమె మాటలు విన్న చాలా మంది కన్విన్స్ అయ్యే సమయానికే కేపీ చౌదరికి ఆమె మద్దులు ఇస్తున్న ఫొటోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలపై ఆమె ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు. ప్రొడ్యూసర్ అయితే కథ చర్చలు, సినిమాకు సంబంధించిన విషయాలు ఉంటాయి కానీ ఇలా ముద్దులు పెట్టుకోవడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేపీ చౌదరి మాత్రం ఎవరితో తనకు ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ కేసు పూర్తిగా తనకు సంబంధించిందని చెప్పుకచ్చాడు.