SurekhaVani & KP Chowedery : డ్రగ్స్ ఈ పేరు వింటే చాలు టాలీవుడ్ నిలువెల్లా కదిలిపోతుంది. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఈ డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టి పీడించింది.. ఆ సమయంలో టాప్ సెలెబ్రిటీలుగా ఉన్న ఎందరో విచారణ ఎదుర్కొన్నారు. మరి మళ్ళీ ఇన్నేళ్లకు ఈ డ్రగ్స్ పేరు టాలీవుడ్ చుట్టూ తిరుగుతుంది. అందుకు కారణం కబాలి నిర్మాత..
నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అరెస్ట్ ఇటు సినీ వర్గంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపింది. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈయన విచారణలో కొద్దిమంది పేర్లు మాత్రమే బయట పెట్టినట్టు చెబుతున్నారు. ఇతడి కాల్ డేటా ను పరిశీలించిన పోలీసులకు చాలా మంది కాల్స్ ను గుర్తించినట్టు తెలుస్తుంది.
అలాగే ఈయన బ్యాంక్ లావాదేవీలు కేసుల పరిశీలిస్తున్నారు. మరి కేపీ చౌదరితో సన్నిహతిహంగా ఉన్న వారిలో ప్రముఖ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత పేరు కూడా వినిపిస్తుంది.. ఈ అమ్మడు కేపీ చౌదరితో అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఏకంగా ఇతడికి ముద్దు పెడుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇతడితో ఇంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో సురేఖా వాణికి, సుప్రీతకు డ్రగ్స్ తో సంబంధం ఉందని ప్రచారం స్టార్ట్ అయ్యింది. మరి ఈ విషయంలో ఈ తల్లి కూతుర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.. అలానే అషు రెడ్డి పేరు కూడా వినిపించింది. దీంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ రూమర్స్ ను ఖండించింది.. ఫోటోలు దిగినంత మాత్రాన డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టేనా అని వారి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు..
ReplyForward
|