Namitha Drug caseNamitha Drug case : డ్రగ్స్ కేసు సంచలనం కలిగిస్తోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి అందరి జాతకాలు బయటపెడుతున్నాడు. దీంతో డ్రగ్స్ కేసులో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే విషయాలు వెల్లడిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ నమిత భర్త చంద్రశేఖర్ సైతం తన భార్య పాత్రపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో సైతం డ్రగ్స్ బాగోతాలు వెలుగు చూసినా కొద్ది రోజులకు మళ్లీ యథావిధిగా మారిపోవడం సహజం.
నమిత డ్రగ్స్ కు బానిసైందని ఆమె భర్తే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తన భార్య డ్రగ్స్ విక్రయించే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెబుతున్నాడు. గతంలో వారిద్దరు ఏకాంతంగా దొరికారని ఎందుకిలా చేస్తున్నారంటే తనపైనే దాడికి దిగారని చెప్పడంతో అందరు అవాక్కవుతున్నారు. నమిత భర్తే ఇలా చెప్పడంతో డ్రగ్స్ మూలాలు ఎంతగా విస్తరించాయో తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే సురేఖ వాణి, జ్యోతి, అషురెడ్డి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై సురేఖ వాణి స్పందిస్తూ తనకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో కూడా డ్రగ్స్ ప్రకంపనలు పరిశ్రమను కుదిపేశాయి. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసు బయటకు రావడంతో ఆందోళన పెరుగుతోంది. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో తెలియడం లేదు.
కన్నడ నిర్మాత చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం నమితను పెళ్లి చేసుకున్నాడు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన నమిత డ్రగ్స్ సరఫరా చేసే లక్ష్మీత్ ప్రభుతో శారీరక సంబంధం పెట్టుకుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో డ్రగ్స్ కేసు ఇంకా విస్తరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు నమిత భర్త ఫిర్యాదుతో కేసు ఎటు వైపు వెళ్తుంతో తెలియడం లేదు.