Nikhil comments Drugs : డ్రగ్స్ మహమ్మారి మన టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది. గతంలో ఎన్నోసార్లు డ్రగ్స్ కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. అప్పట్లో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుని విచారణకు కూడా హాజరయ్యారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ చుట్టూ డ్రగ్స్ కేసు తిరగడం కలకలం రేపుతోంది..
కేపీ చౌదరి డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకు ఎప్పుడైతే చిక్కాడో అప్పటి నుండి డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతుంది.. ఈయన విచారణలో కొందరి నటీనటుల పేర్లు చెప్పారని టాక్ బయటకు వచ్చింది. అందులో ముఖ్యంగా సుప్రీత, సురేఖా వాణి, అషు రెడ్డి, నటి జ్యోతి వంటి వారి ఇవాల్వ్ అయినట్టు తెలుస్తుంది.
ఈయన కాల్ డేటా ఆధారంగా వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే యంగ్ హీరో నిఖిల్ తాజాగా డ్రగ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈయన తాజాగా పోలీసులు మాధకద్రవ్యాల నిరోధక విభాగం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక్కడ ఈయన సంచలన విషయాలు తెలిపాడు.
నిఖిల్ మాట్లాడుతూ.. ”నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేసారని.. కానీ నేను ఎప్పుడు డ్రగ్స్ జోలికి వెళ్లలేదని.. అలాంటి వాటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తెలిపాడు. డ్రగ్స్ వల్ల విద్యార్థుల భావిష్యత్తు పాడవుతుందని డ్రగ్స్ ను దరిచేరకుండా వాటి జోలికి మాత్రం వెళ్లొద్దు అంటూ ఈయన చెప్పుకొచ్చారు. దీంతో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.