Team India వన్డే ప్రపంచ కప్ కు ఇంకా రెండు నెలల సమయమే ఉంది. కానీ టీమిండియా ఇంకా కోలుకోవడం లేదు. ప్రపంచ కప్ లో ఆడే ఆటగాళ్ల ఫిట్ నెస్ పై సందిగ్దత నెలకొంది. జట్టు ఎంపిక విషయంలో గందరగోళం ఏర్పడింది. దీంతో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఆటగాళ్ల ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి ఆట ఎలా ఉండబోతోందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది.
సొంతగడ్డపై బాగానే రాణిస్తారు. కానీ విదేశీ పిచ్ లపై తడబతారు. 2011లో ధోని సారధ్యంలో ఇండియా ప్రపంచ కప్ ను రెండోసారి సొంతం చేసుకోవడం విశేషం. ఇంతవరకు మళ్లీ కప్ ను ముద్దాడిన క్షణాలు లేకపో వడం బాధాకరమే. ఈ క్రమంలో ఈసారి ప్రపంచ కప్ పై కూడా అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆటగాళ్ల తీరు ప్రశ్నార్థకంగానే మారుతోంది.
2016లో భారత వేదికగా జరిగిన టీ 20 ప్రపంచ కప్ లోనే టీమిండియా విఫలమైంది. ఇప్పుడు వన్డే ప్రపంచ కప్ వంతు వచ్చింది. ద్వైపాక్షిక సిరీస్ ల్లో విజయాలు సాధించే టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజయాలు దక్కించుకోవడం లేదు. ఫలితంగా కప్ లు గెలుచుకోవడం లేదు. వన్డే ప్రపంచ కప్ లో విజేతగా నిలవాలని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.
రోహిత్ శర్ం, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లే మునుపటి పోరాట పటిమ ప్రదర్శించడం లేదు. వీరిద్దరి ఫామ్ పై కొంత కాలంగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జట్టు ఎంపికలోనే తప్పిదాలు ఉన్నాయని వాదిస్తున్నారు. ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి వారు చతికిలపడిపోయారు.
ఇలా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ ఉంటేనే ఎంపిక చేయాలి. కానీ రాజకీయాలకు తలొగ్గి మొహమాటానికి పోయి సెలెక్ట్ చేస్తే పరిస్థితి దిగజారుతుంది. సెలెక్టర్లకు ముందు చూపు ఉండాలి. వారి ప్రదర్శన ఆధారంగా వారిని తీసుకుని ఆటకు వెళ్లాలి కానీ ఇలా చేస్తే ముమ్మాటికి కూడా కప్ రాదు. నిరాశతో వెనుదిరగాల్సి వస్తుంది.