30 C
India
Wednesday, May 15, 2024
More

    G20 Summit 2023 : G20 తో ఢిల్లీలో ఆంక్షలు..? ఎలా ఉన్నాయంటే..?

    Date:

    G20 Summit 2023 :

    చరిత్రలో మొట్ట మొదటిసారి భారతదేశం గ్రూప్ ఆఫ్-20 (G20) దేశాలకు హోస్ట్‌గా మారింది. G20 గ్రూప్‌లో భారత్‌తో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, ది. యూకే, యూఎస్ మరియు యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఉన్నాయి. G20 సమ్మిట్ సన్నాహాలు పూర్తి అంకితభావంతో జరుగుతున్నాయి. ఇందులో కేంద్రం మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దాయి.

    G20 సమ్మిట్ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. రెండు రోజుల సదస్సులో 20 సభ్య దేశాలతో సహా 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. ప్రగతి మైదాన్‌లోని అత్యాధునికమైన భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో G20 సమ్మిట్ కు వేదిక కానుంది.

    ఢిల్లీలో ఆంక్షలు
    ఈ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. కొన్ని మాత్రమే తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. చాలా వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఏవి మూసి ఉండబోతున్నాయంటే.

    ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, సుప్రీంకోర్టు, బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, లిక్కర్ దుకాణాలు (న్యూ ఢిల్లీ పోలీస్ డిస్ట్రిక్ పరిధిలోనివి) తమ కార్యకలాపాలను 2 రోజులు నిలిపివేయనున్నాయి.
    దీనితో పాటు సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు 200కు పైగా ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసి దారి మళ్లించాలని ఉత్తర రైల్వే నిర్ణయించింది.

    షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న 90కి పైగా రైళ్ల సర్వీసులు రద్దు చేయగా.. సెప్టెంబర్ 10న కూడా 100కు పైగా ప్యాసింజర్ రైళ్లు రద్దు కానున్నాయి. వీటిలో చాలా రైళ్లు ఢిల్లీ నుంచి దక్షిణ హర్యానాలోని సోనిపట్-పానిపట్, రోహ్తక్, రేవారీ మరియు పల్వాల్ మార్గాలకు నడుస్తాయి. అంతే కాకుండా ఢిల్లీ-రేవారి ఎక్స్‌ప్రెస్ స్పెషల్ మరియు రేవారి-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ రైళ్లు సెప్టెంబర్ 11న రద్దు చేయబడతాయి. వీటితో పాటు 3 సాటర్ అటోలు, ట్యాక్సీలు రద్దు చేయబడ్డాయి.

    తెరిచి ఉంచేవి..
    న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC) పరిధి బయట ఉన్నవి దాదాపు తెరిచే ఉంచుతారు. మాల్స్, మార్కెట్స్, నిత్యావసర వస్తువులైన పాలు, మెడికల్ లాంటివి. ఢిల్లీ మెట్రో (సుప్రీం కోర్టు స్టేషన్ మినహా), రింగ్ రోడ్డులోని బస్సులు (కార్పొరేషన్ పరిధిలో కాకుండా) నడవనున్నాయి. ఈ సమ్మిట్ ముగియడంతో అన్నీ యధా విధిగా ఉంటాయిని అక్కడి ప్రభుత్వం చెప్పింది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    Hindu Population : భారతదేశంలో తగ్గుతున్న హిందువుల జనాభా

    Hindu Population : భారత దేశంలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...