- కలిసి నడిచేందుకే ఆ సంకేతాలు

Mamatha Benerjee : ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేరే. రాజకీయాల్లో తనదైన శైలి లో ముందుకు సాగుతున్నారు. ఒకానొక దశలో కేంద్ర ప్రభుత్వం ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆమె ఫైట్ కొనసాగించారు. ఏకంగా ప్రధానే రంగంలోకి దిగి, మమతను పశ్చిమ బెంగాల్ లో ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఆమె రెండో సారి అధికారంలోకి వచ్చి సవాల్ విసిరారు. కాంగ్రెస్ తో కొంత కాలం అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ పై మారిన శైలి..
కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం తర్వాత మమత శైలిలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తున్నది. పొత్తులపై ఆమె సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు బలం ఉన్న చోట తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇందుకు ఆమె ఒక షరతు విధించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడాలని కోరారు. యూపీలో సమావాజ్ వాదీ, బెంగాల్ లో తృణమూల్, బిహార్ లో జేడీయూ – ఆర్జేడీ, ఢిల్లీలో ఆప్ బలంగా ఉన్నాయని, ఆయా చోట్ల కాంగ్రెస్ మద్దతునిస్తే పొత్తులపై తాము ముందకెళ్తామని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేయబోమని, సీట్లు పంపిణీపై మంచి స్నేహపూర్వక నిర్ణయంతో ముందుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్తో కూటమికి పలు ప్రాంతీయ పార్టీలు రాయబారం నడుపుతున్న నేపథ్యంలో మమత వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 2024 ఎన్నికలకు ముందు ఇది కాంగ్రెస్ శ్రేణులకు ఇది మంచి శుభవార్తే అని చెప్పుకోవాలి.