Prabhas Movies : బ్లాక్ బస్టర్ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకున్నా ప్రభాస్ పేరు మాత్రం మార్కెట్లో తగ్గడం లేదు. దాదాపు బాహుబలి 2 తర్వాత ఆయనకు ఆ రేంజ్ లో సినిమాలు ఏవీ పడలేదు. భారీ నిర్మాణ సంస్థలు ముందుకువచ్చి కోట్లాది రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు భారీ ఫ్లాపులను ఎదుర్కొన్నాయి. అయినా ప్రభాస్ కు మాత్రం క్రేజ్ తగ్గలేదు.
‘సాహో’, ‘ఆదిపురుష్’ చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా నార్త్ ఇండియాలో కూడా చెప్పుకోదగ్గ అవకాశాలను క్రియేట్ చేయడంలో ప్రభాస్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. దీంతో నిర్మాతలు ఆయన ప్రాజెక్టులపై భారీ గానే పెట్టుబడులు పెడుతున్నారు. ఆదిపురుష్ భారీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ వసూళ్లలో మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదంతా ఒన్లీ ప్రభాస్ నేమ్ మహత్యమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎక్కువ మంది ఫ్యాన్స్, యూత్ కేవలం ప్రభాస్ కటౌట్ ను చూసి మాత్రమే థియేటర్ వరకు వస్తున్నారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక భారీ హాలీవుడ్ సంస్థ ప్రభాస్ సినిమాను సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఓ ప్రముఖ హాలీవుడ్ స్టూడియో ‘ప్రాజెక్ట్ కే’ను అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు ఉంచుతుందని సమాచారం. ఈ ఏడాది కామిక్ కాన్ లో ఈ చిత్రానికి స్థానం సంపాదించడానికి ఈ స్టూడియో దోహదపడిందని అంటున్నారు. జూలై 20న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్, టీజర్, విడుదల తేదీని విడుదల చేయనున్నారు.
ReplyForward
|