Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ నెం.1 స్థానంలో దూసుకుపోతున్నారు. రీసెంట్సలార్ తో మరో బాక్సాఫీస్ హిట్ అందించారు. అయితే, ఆయన ప్రేమలో పడ్డారని, తనలో తెలియకుండేనే ఏదో మ్యాజిక్ ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అంత మ్యాజిక్ ఏముందో తెలుసుకుందాం.
ఫ్యాన్స్లో గూస్బంప్స్
ప్రభాస్ అంటే ఆరడగుల కటౌట్. ప్రభాస్ ను చూసినా.. కనీసం పేరు విన్నా ఫ్యాన్స్లో గూస్బంప్స్ వస్తుంటాయి. అంతలా ఫ్యాన్స్ మనస్సులో స్థానం సంపాదించుకున్నారు ఆయన. ఇండస్ట్రీలో మోస్ట్ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆయనే. అందరూ పెళ్లి పీటలెక్కుతున్నా ఈయన మాత్రం పెళ్లి అనే పదం గురించి అస్సలు ఆలోచించకుండా కెరీర్లో ముందుకెళ్తున్నారు.
వరుస మూవీస్ తో బిజీ
కెరీర్ పరంగా చూసుకుంటే ఫుల్బిజీగా ఉన్నారు ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారినా ఎన్నో బడా ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వరుస ఫ్లాపులుగా మిగిలినా.. ఆయన మార్కెట్ మాత్రం కొంచమైనా తగ్గలేదు సరకదా.. నేలకు కొట్టిన రబ్బరు బంతిలా మరింత ఎత్తుకు ఎగిరింది. రీసెంట్సలార్తో బాక్సాఫీస్ను షేక్ చేశారు. దాదాపు వెయ్యి కోట్ల క్లబ్ లో కాలు పెట్టారు.
చేతి నిండా సినిమాలు
ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’, కన్నప్ప, రాజాసాబ్ వరుసగా రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రాలతో పాటు సలార్2, స్పిరిట్, కల్కి సీక్వెల్ కూడా వచ్చే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు హను రాఘవపూడి, లోకేశ్ కనగరాజ్తో చర్చలు జరుగుతున్నాయి. అలా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు డార్లింగ్.
త్రో బ్యాక్ వీడియో వైరల్
ఇప్పుడు ఆయన గురించి ఓ త్రో బ్యాక్ వీడియో వైరల్ అవుతోంది. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడారు. పూరి అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. బుజ్జిగాడు సమయంలోనే ఆయన ఆటిట్యూడ్కు తాను ఫిదా అయిపోయినట్లు గుర్తు చేసుకున్నారు. ఒక హీరోకు పూరి ఇచ్చే క్యారెక్టరైజేషన్ బాగుంటుందని, ఆయన గతంలో తీసిన సినిమాలు చూసి తనతో ప్రేమలో పడిపోయానని చెప్పుకొచ్చారు. పూరీలో మ్యాజిక్ ఉందని కూడా ప్రభాస్ చెప్పారు.
ప్రభాస్ కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు
ఒక సారి పూరితో సినిమా చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుందని, అందుకే పూరి అంటే తనకు ఇష్టమని చెప్పారు. కాగా, పూరి ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఉన్నారు. ఆయన తెరకెక్కించిన లైగర్ భారీ డిజాస్టర్అందుకుంది. ప్రస్తుతం ఆయన రామ్పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్లో తెరెకెక్కుతోంది.