30.7 C
India
Wednesday, February 18, 2026
More

    మహేశ్ బాబు #SSMB29 పై ఇంట్రస్టింగ్ న్యూస్

    Date:

    SSMB29
    SSMB29

    SSMB29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తియింది. ఈ నేపథ్యంలో ఇటీవల టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ‘హాసిని క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తోంది. అయితే తర్వాతి షూటింగ్ షెడ్యూల్ ను జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభిస్తుంది మూవీ యూనిట్. ‘గుంటూరు కారం’ను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 13 జనవరి, 2024న రిలీజ్ అంటూ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

    ఈ ప్రాజెక్ట్ ముగియగానే మహేశ్ బాబు రాజమౌళి కాంబోలో గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ #SSMB29 లో నటించనున్నారు. ఇందుకు రాజమౌళి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మూవీకి సంబంధించి స్టోరీ, స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల భారీ బడ్జెత్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘దుర్గా ఆర్ట్స్ బ్యానర్’పై కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు.

    అయితే, తాజాగా ఈ మూవీకి సంబంధించి న్యూస్ మీడియా వర్గాల్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు, ఖన్స్‌లో ఒకరైన అమీర్ ఖాన్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్న ఈ మూవీకి సంబంధించి ఈ వార్తల్లో ఎలంటి నిజం లేదని కొందరు కొట్టి పారేస్తున్నా. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఈ సినిమాలో ఖాన్ విలన్ గా చేస్తే మరింత హైప్ పెరుగుతుందని కూడా కొందరు అంటున్నారు. కాగా త్వరలో #SSMB 29కు సంబంధించి మేకర్స్ నుంచి  అనౌన్స్ మెంట్ అధికారికంగా రాబోతోంది. దాని అనంతరం తారాగణం కూడా వెల్లడిస్తారని తెలిసింది. ఏది ఏమైనా దర్శకధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్టు అని, బాహుబలి తర్వాత ఆ రేంజ్ కు తగ్గకుండా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...