onions ప్రస్తుతం టమాటా ధరలు కొండెక్కాయి. టమాట ధర ఒక్కసారిగా పెరగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. టమాట ధర అందరిని కలవరపెడుతోంది. ఇక ఉల్లిపాయల ధరలు కూడా పెరిగే సూచనలు ఉండటంతో కేంద్రం మేల్కొంది. ఒకవేళ ఉల్లి ధర పెరిగితే ఏం చేయాలనుకుని చర్యలకు సమాయత్తం అయింది. ఉల్లిపాయలకు ఇర్రేడియేషన్ చేయాలని చూస్తోంది.
టమాటా ధర రూ. 200 దాటడంతో అందరు కంగారు పడ్డారు. సామాన్యులైతే టమాట కొనడమే మానేశారు. టమాట కొనే బదులు చికెన్ కొంటే కిలో వస్తుందని అనుకుని అందరు చికెన్ కొనుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల ధరలు కూడా పెరిగితే కష్టమని తెలుసుకుని వాటి ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకు ఇర్రేడియేషన్ అమలు చేయబోతోంది.
ఇర్రేడియేషన్ ప్రక్రియను కేంద్రం ప్రయోగించడం తొలిసారి. ఇందులో ఎక్స్ రే, గామా, ఎలక్ర్టాన్ కిరణాలను ఆహారంపై ప్రసరింపచేస్తారు. ప్రస్తుతం కేంద్రం గామా కిరణాలను ప్రసరింపచేస్తుంది. ఉల్లిపాయలపై సూక్ష్మజీవులు, పురుగులు, కీటకాలు పూర్తిగా చనిపోతాయి. ఇర్రేడియేషన్ వల్ల ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. నాణ్యత, రుచి మారవు. ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల కొరత ఉండదు.
కేంద్రం 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను కొన్ని నిల్వ చేస్తోంది. ఇర్రేడియేషన్ వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. దీంతో ఉల్లిపాయలే కాదు దుంపలు కూడా మెలకెత్తకుండా ఉంటాయి. గామా కిరణాలు మనుషులకు ప్రమాదకరమైనవి. ఈ కిరణాలు ఉల్లిపాయలకు వాడినా నష్టమేమీ ఉండదు. అందుకే ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి ధర పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్లాన్ చేస్తోంది.