28.5 C
India
Sunday, May 19, 2024
More

    Jagan or Chandrababu : ఏపీలో జగన్.. చంద్రబాబే.. మూడో వ్యక్తికి నోచాన్స్..!

    Date:

    Jagan or Chandrababu
    Jagan or Chandrababu

    Jagan or Chandrababu : ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ పోటీ చంద్రబాబు, జగన్ మధ్య ఉంటుందనేది ఎవరిని అడిగినా చెబుతారు. మూడో వ్యక్తికి ప్రస్తుతం రాష్ర్టంలో చాన్స్ ఉండే పరిస్థితి లేదు. అయితే జనసేన చీఫ్ పవన్ కూడా తాను సీఎం కావాలని అనుకుంటున్నారు. అయితే ఆ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం లేదు. కనీసం కింగ్ మేకర్ అయితేనైనా చాన్స్ వస్తుందని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఇప్పటికిప్పుడు జనసేనానికి ఉందా అనేది సంశయంగానే కనిపిస్తున్నది. ప్రస్తుతానికైతే ఆయన కాపులను ఓట్లను నమ్ముకొనే ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన యాత్ర కూడా గోదావరి జిల్లాల్లోనే జరుగుతున్నది.

    అయితే ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ మధ్యే కీలక పోరు జరగనుంది. అయితే జగన్ పై పోరులో ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. చంద్రబాబుకు ఇటు జనసేనతో పాటు సీపీఎం, సీపీఐ మద్దతునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా ఇదే టీంలోకి వచ్చే అవకాశముంది. ఈ సమయంలో చంద్రబాబు తప్ప మరెవరికీ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్ ఉండకపోవచ్చు. రాజకీయాల్లో సీనియర్, 14 ఏండ్ల పాటు సీఎంగా చేసిన అనుభవం చంద్రబాబుకు కలిసి రావచ్చు. రాజకీయాల్లో జూనియర్ అయిన పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి ఆ అవకాశం ఉండకపోవచ్చు. పొత్తులతో చంద్రబాబు కూటమి వర్సెస్ జగన్ గా మారిపోనుంది. వైసీపీ బాధిత నేతలంతా ఈసారి చంద్రబాబుకు అండగా నిలవబోతున్నారు.

    మరోవైపు వైసీపీ కూడా ప్రస్తుతం బలంగా కనిపిస్తున్నది. జగన్ అధికారంలో కి వచ్చాక ప్రతిపక్షాల నేతలు, వనరులపై కోలుకోకుండా దెబ్బకొట్టారు. ఇక ఈ సమయంలో జగన్ ను ఢీకొట్టాలంటే  అంతకంటే ఎక్కువ రాజకీయ చతురత కలిగిన వ్యక్తికే అది సాధ్యమవుతుంది. అందులో చూసుకుంటే చంద్రబాబే ముందుంటారు. 2024 ఎన్నికల్లో జగన్, చంద్రబాబు మధ్యే పోటీ ఉండనుంది. ఇంకో మూడో వ్యక్తికే ప్రస్తుతమైతే చాన్స్ ఉండే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం అసెంబ్లీలో ఎలాగైనా అడుగు పెట్టాలని భావిస్తున్నారు. అదే స్థాయిలో వైసీపీని బలంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...