Kareena Kapoor Jaane Jaane : సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. ఈమెకు ఇండియా మొత్తమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కరీనా కపూర్ వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుని పిల్లలకు కూడా జన్మనిచ్చిన ఈ బ్యూటీ అందాల విందు మాత్రం ఏ మాత్రం తగ్గించకుండా మరింత రెచ్చిపోతుంది.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ గ్లామర్ షో కూడా తగ్గకుండా యూత్ ను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది.. ఇక ఈమె నటించిన జానే జాన్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి దీని రివ్యూ అండ్ రేటింగ్ చూసేద్దాం..
నటీనటులు :
కరీనా కపూర్,
జైదీప్ అహ్లావత్,
విజయ్ వర్మ,
సౌరభ్ సచ్ దేవా,
నైషా ఖన్నా తదితరులు..
డైరెక్టర్ : సుజోయ్ ఘోష్
ప్రొడ్యూసర్స్ : జే శేవక్రమణి, అక్షయ్ పూరి, శోభా కపూర్, ఏక్తా కపూర్, హ్యునూవ్ థామస్
మ్యూజిక్ డైరెక్టర్ : సచిన్ జిగర్, షార్ పోలీస్
కథ : కలింపాంగ్ లో జీవించే ఒంటరి తల్లి మాయ (కరీనా కపూర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కూతురు తారా (నైషా ఖన్నా) బాధ్యతను చూసుకోవడానికి ఈమె ఒక కేఫ్ లో పని చేస్తుంటుంది.. ఈమె తన భర్త అజిత్ (సౌరభ్ ) తో తన కూతురు పుట్టక ముందే విడిపోతుంది. ఇదే క్రమంలో నరేన్ వ్యాస్ (జైదీప్ అహ్లావత్) ఈమెను సీక్రెట్ గా ప్రేమిస్తూ ఉంటాడు.. ఇలా జరుగుతున్న క్రమంలో మాయ ఒకానొక సమయంలో తన భర్త అజిత్ ను తార సహాయంతో చంపేస్తుంది. ఇతడి మర్డర్ చుట్టూ ఆ తర్వాత మిగిలిన కథ నడుస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ :
కరీనా కపూర్ ఎప్పటి లాగానే తన నటనతో ఆకట్టుకుంది. లాస్ట్ 40 నిముషాల్లో ఈమె నటన సినిమాకే పీక్స్ అని చెప్పాలి. అలాగే జైదీప్ ఆడియెన్స్ ను బాగా అలరించారు. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వర్మ మంచి పర్ఫార్మెన్స్ కనబర్చారు.
సాంకేతిక నిపుణుల పర్ఫార్మెన్స్ :
డైరెక్టర్ సుజోయ్ నటీనటుల నుండి మంచి నటన రాబట్టారు.. జాపనీస్ నవల ఆధారంగా తెరకెక్కినప్పటికీ దృశ్యం సినిమాను గుర్తు చేసేలా ఉంది.. స్క్రీన్ ప్లే మరింత బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. షోర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అవికా ముఖోపాధ్యాయ్ కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల పర్ఫార్మెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్
ఎడిటింగ్
చివరిగా.. మొత్తంగా అయితే ఈ క్రైం థ్రిల్లర్ పర్వాలేదు అనిపించేలా ఉంది.. చివరి 40 నిముషాల పోర్షన్ బాగుంటుంది.. దృశ్యం సినిమాను గుర్తు చేసేలా ఉంది.. మరో పాయింట్ తో రాసుకుని ఉంటే బాగుండేది.. కరీనా, విజయ్ వర్మ, జైదీప్ ఆకట్టు కున్నారు.
రేటింగ్ : 2.75/5