37 C
India
Friday, May 17, 2024
More

    కుమార‌స్వామికి హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్‌.. కారణమెంటీ?

    Date:

    kcr
    kcr

    కొంత‌కాలం క్రితం వ‌ర‌కు క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో సీఎం కేసీఆర్ చాలా మంచి రిలేష‌న్సే మెయింటెన్ చేశారు. ఇద్ద‌రి రాష్ట్రాలు,పార్టీలు వేర్వేనా..ఒకే పార్టీ..ఒకే రాష్ట్రం..ఒకే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్నంత బిల్డ‌ప్ ఇచ్చారు. తెలంగాణలో ఎలాంటి ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు జ‌రిగినా..కుమార‌స్వామిని కేసీఆర్ హైద‌రాబాద్‌కు ఆహ్వానించే వారు. గ‌తంలో బీజేపీ కాంగ్రెస్‌,జేడీఎస్ స‌ర్కార్ కూల్చాల‌ని చూసిన‌ప్పుడు కూడా కుమార‌స్వామికి అన్ని ర‌కాలుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

    ఇక ఆ త‌ర్వాత కూడా కుమార‌స్వామికి అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు కూడా చెప్పారు. ఈసారి ఎన్నిక‌ల్లో జేడీఎస్ త‌ర‌పున క‌ర్నాట‌క ఎల‌క్ష‌న్స్ లో ప్ర‌చారం కూడా చేస్తామ‌ని చెప్పారు. ఉత్త‌ర క‌ర్నాట‌క‌లోని తాము కొన్ని స్థానాల్లో పోటీ చేసి మిగ‌తా క‌ర్నాక‌ట‌లో జేడీఎస్‌కు స‌పోర్ట్ చేస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

    అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న ఇప్పుడు అస‌లు జేడీఎస్ ముచ్చ‌ట‌నే కేసీఆర్ ఎత్త‌డం లేదు. త‌న ఫోక‌స్ మొత్తం మ‌హారాష్ట్ర మీదే పెట్టారు. అక్క‌డే బీఆర్ఎస్ వ‌రుస కార్య‌క్ర‌మాలు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3 బ‌హిరంగ స‌భ‌లు పెట్టింది. నాందేడ్‌,కందార్,ఔరంగాబాద్ ఇలా స‌భ‌లు పెడుతూ..కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే క‌ర్నాట‌కలో మాత్రం ఎన్నిక‌ల‌ ప్ర‌చారం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. మ‌రో ప‌ది రోజులు మాత్ర‌మే ప్ర‌చారానికి టైం మిగిలి ఉంది. ఈ నేప‌థ్యంలోనే ముందుగా కుమార‌స్వామికి హామీ ఇచ్చిన‌ట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క‌ర్నాట‌క‌లో జేడీఎస్ త‌ర‌పున ప్ర‌చారం చేసే ఛాన్సెస్ క‌నిపించ‌డం లేదు. దీంతో కేసీఆర్ వ‌స్తే ఎంతో కొంత తెలుగు వారి ఓట్లు జేడీఎస్‌కు ప‌డ‌తాయ‌ని భావించిన కుమార్ స్వామికి ఆయ‌న హ్యాండ్ ఇవ్వ‌డంతో..ఇదేం దోస్తానా అంటు ఆవేద‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం.

    Share post:

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Rythu Bandhu : రైతుబంధు అధికార పార్టీకి వరం కానుందా?

    Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు...

    Telangana Muslim : తెలంగాణ ముస్లిం జనాభా కేసీఆర్ పట్ల సంతృప్తిగా లేరా? కారణం ఇదేనా?

    Telangana Muslim : రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు బీఆర్ఎస్...