Raashi Khanna : ఆకట్టుకునే అందంతో పాటుగా అదిరిపోయే అభినయం కూడా ఉన్న ముద్దుగుమ్మల్లో ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా ఒకరు.. తన క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకట్టు కోవడమే కాకుండా నటనతో కూడా అలానే మెప్పిస్తుంది.. ఈ చిన్నది టాలీవుడ్ లో ఇప్పటికే వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది.
రాశీ ఖన్నా మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తన అంధ చందాలతో దర్శకులను ఆకట్టుకుని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో నాగార్జున, నాగ చైతన్య నటించిన మనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఇందులో ఒక చిన్న పాత్ర చేసి ఆకట్టుకుంది.. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస అవకాశాలు అయితే అందుకుంటూ దూసుకు పోతుంది.
ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. డేటింగ్ వల్ల వెయిట్ లాస్ అయ్యాను అలాగే బ్రేకప్ వల్ల బరువు పెరిగాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.. అంతేకాదు తనకు ఉన్న హెల్త్ ప్రాబ్లెమ్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
అప్పట్లో ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను.. అతడితో బ్రేకప్ అవడంతో డిప్రెషన్ కు లోనయ్యాను.. అంతేకాదు నాకు థైరాయిడ్ ప్రాబ్లెమ్ ఉండడంతో బరువు కంట్రోల్ లేకుండా పెరిగానని.. ఎన్ని వర్కౌట్స్, డేటింగ్ చేసిన తగ్గలేదు అని తెలిపింది.. ఫైనల్ గా నన్ను అర్ధం చేసుకునే వాడు దొరకడంతో డేటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.