
Mahesh Mimicry : మిల్క్ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్న ఘట్టమనేని మహేశ్ బాబు టాలెంట్ చాలా ఎక్కువని ఆయన చిననాన్న ఘట్టమనేని ఆదిశేషగిరి రావు అన్నారు. ఆయన మహేశ్ బాబు గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. తన తండ్రి బ్యాగ్రౌండ్ తో ఇంట్రీ ఇచ్చినా తనదైన స్టయిల్ చూపిస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అయితే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు మహేశ్ గురించి కొన్ని ఆసక్తికరమైన శిషయాలు వెల్లడించారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శేషగిరిరావు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
మహేశ్ బాబు గురించి ఆయన అభిమానులకు ఆయన సినిమాలు చూసే వారికి తెలిసింది కొంతే. ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ వాయిన్ అయినా సరే ఆయన ఇట్టే ఇమిటేట్ చేయగలడు. నటనలోని ఆయన టాలెంట్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ భావాన్ని చక్కగా పండించగలడు ఆయన. అమితాబ్ లోని టాలెంట్ కు మహేశ్ బాబు ఏమాత్రం తక్కువ కాదు. కొడుకు దిద్దిన కాపురం సినిమా సమయంలోనే మహేశ్ పెద్ద స్టార్ హీరో అవుతాడని అన్నా నేను మాట్లాడుకున్నాం. కష్టం అంటే మహేశ్ కు చాలా ఇష్టం ప్రతీ విషయాన్ని చాలెంజ్ గా తీసుకుంటాడు. మొదట్లో డ్యాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు అది నేర్చుకున్నాడు. సినిమాల్లో కూడా బోలెడు రిస్కీ షాట్లు డూప్ లేకుండా చేసేవాడు మహేశ్ బాబు అంటూ ఇంకా చాలా ఆసక్తి కరమైన విషయాలు చెప్పాడు మహేశ్ చిన్నాన్న.