31 C
India
Friday, May 17, 2024
More

    Revenge on Chandrababu : ప్రతి రాయిని గుర్తు పెట్టుకున్నారా? చంద్రబాబు పై రివేంజ్ కు బీజేపీ ప్లాన్!

    Date:

    revenge on Chandrababu
    revenge on Chandrababu

    Revenge on Chandrababu : బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేస్తు్న్న ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు. బీజేపీ ని వీడి తప్పు చేశానేమో అనే భావన చంద్రబాబు లో కనిపిస్తున్నది. బీజేపీ నేతలూ టీడీపీతో చెలిమిని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దల్లో సానుకూలత కనిపించడం లేదు. టీడీపీతో పొత్తు కారణంగా ఏపీలో తమ పార్టీకి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్నది భావిస్తున్నారు. అటు తెలంగాణ లోనూ ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ గతం కంటే మెరుగుయ్యింది. టీడీపీ స్థానాన్ని కొంత వరకు బీజేపీ భర్తీ చేయగలిగింది. ఇప్పుడు టీడీపీతో చేతులు కలిపితే తెలంగాణ లో కొంత పట్టు కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్నది. చంద్రబాబు నాయుడుతో చెలిమి అంత మంచిది కాదని ఏపీ నేతలు బీజేపీ పెద్దలకు వివరిస్తున్నారు.

    2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబు కాంగ్రెస్తో ఎలా పొత్తు పెట్టుకున్నారో గుర్తు చేస్తున్నారు. తిరుపతిలో అమిత్ షాపై టీడీపీ రాళ్లదాడిని మరిచి పోలేదు. గుంటూరులో ప్రధాని సభ సందర్భంగా నల్ల బెలూన్లను ఎగురవేసిన విధానాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేసిన విమర్శలను బీజేపీ కార్యకర్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. రెండు పార్టీల మధ్య సఖ్యత అంత తేలికైన పని కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు చాలా మంది నేతలు సానుకూలంగా లేరు.

    బాబు తహతహ

    చంద్రబాబు బీజేపీ తో పొత్తుకు తహతహలాడుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే బీజేపీతో చెలిమి మేలని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖరారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీని కూడా చేర్చుకుంటే రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ బలపడవచ్చని భావిస్తున్నది. వైసీపీని ఓడించే అవకాశాలు మరింత ఎక్కువవుతాయని ఆలోచిస్తున్నది. అయితే బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నట్లు కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. అటు వైపు నుంచి సానుకూలత వస్తే ఈ పాటికే ఎల్లో మీడియా ఓ రేంజ్ కవరేజ్ కనిపించేది. దీనిని బట్టి చూస్తే పొత్తు కుదరడం లేదనే తెలుస్తున్నది.

    ఏపీ అధికార పార్టీ నుంచి అన్ని విషయాల్లో మద్దతు లభిస్తుండడంతో బీజేపీ వేచి చేసే ధోరణి అవలంబిస్తున్నది. రేపు ఎన్నికల తర్వాత ఎవరి అవసరం ఉంటే వారిని ఎన్డీఏ లో చేర్చుకోవాలని చూస్తున్నది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఉంటే చాలని భావిస్తున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో సొంతంగా పుంజుకునే మార్గాలను అన్వేషిస్తున్నది.

    ప్రతి రాయిని గుర్తు పెట్టుకున్నారా?

    2019 ఎన్నికల ముందు బీజేపీ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత బాబు వ్యవహార శైలిని అమిత్ షా ఇంకా గుర్తుంచుకున్నట్లు ఉన్నది. తిరుపతి కి వచ్చిన అమిత్ షా పై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయి. అప్పుడు అధికారంలో ఉన్న బాబు సహకారం లేకుండా కేంద్ర హోంమంత్రిపై దాడికి దిగడం అనేది అంత మామూలు విషయం కాదు. దీనిని షా మరిచినపోయినట్లు కనిపించడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత బాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతాఇంతా కాదు.

    ప్రధానిపై వ్యక్తిగత విమర్శలు

    ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు బీజేపీని టార్గెట్ చేశాడు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్తాయిలో కూటమి కట్టాడు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట పురుడు పోసుకున్న టీడీపీ అదే కాంగ్రెస్ పంచన చేరడం ఎవరూ మర్చిపోలేదు. జాతీయ స్థాయిలో తాను చక్రం తిప్పుతానంటూ గప్పాలకు పోయాడు. ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగాడు. చేసుకున్న భార్యను వదిలేసినోడు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడా అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఎన్నటికీ మర్చిపోదు. ఈ అంశాలన్నీ బేరిజు వేసుకుంటున్న బీజేపీ ఇప్పటికైతే పొత్తుకు సిద్ధంగా లేదని తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Pawan Kalyan : కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్..

    Pawan Kalyan : కాకినాడ ఎంపీ అభ్యర్థి పై జనసేనాని పవన్...

    TDP Second List : రేపు టీడీపీ రెండో జాబితా.. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

    TDP Second List : ఏపీలో ఎటూ  చూసినా ఎన్నికల కోలాహలమే...