Mega Ganapati : ఈ ఏడాది వినాయక చవితిని ఎక్స్ ట్రా స్పెషల్ టచ్ తో సెలబ్రేట్ చేసుకోవడంతో మెగా ఫ్యామిలీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే రామ్ చరణ్ కూతురు క్లిన్‌కారా తొలిసారిగా రావడం.
దాదాపు 11 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి సంతానమైన క్లిమ్‌కారాకు స్వాగతం పలికారు. మెగా ప్రిన్సెస్ రాకను అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.
దీనికి సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా మెగా అభిమానులు తమ ప్రియమైన కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతీ ఏటా లాగే ‘మెగా’ కుటుంబం ఈ సారి కూడా గణపతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుంది. స్వామి వారి మట్టి విగ్రహాన్ని తీసుకచ్చిన కుటుంబ సభ్యులు తమ పూజా మండపంలో ప్రతిష్టించారు. స్వా్మి వారికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఏటా వైభవంగా నిర్వహించుకుంటామని మెగా కుటుంబం చెప్తుండగా.. ఈ సారి క్లిన్ కారా రాకతో ఈ ఆనంద వేడుకలు మరింత పెరిగాయని కుటుంబం మొత్తం చెప్తోంది.
తమ గణపతి ప్రతిమను సోషల్ మీడియా ఖాతాలో అప్ లోడ్ చేయగా మెగా అభిమానులు వాటిని షేర్ చేస్తున్నారు. రాం చరణ్ తో పాటు మెగా కుటుంబానికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రతీ ఏటా ఇంతే ఆనందంగా వేడుకలు నిర్వహించుకోవాలని ఆశీస్సులు అందజేస్తున్నారు.
View this post on Instagram