31.9 C
India
Friday, May 17, 2024
More

    Mohan Babu : మోహన్ బాబు ఆస్తులు పంచుతున్నారు !

    Date:

    Mohan Babu :

    విలక్షణ నటుడు మోహన్ బాబు. అసలు పేరు భక్తవత్సలం నాయుడు. అతడి గురువు దాసరి నారాయణ రావు పేరును మోహన్ బాబుగా మార్చారు. దీంతో సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటాడు. తన డైలాగ్ వెర్షన్ లో ఎన్నో హావభావాలు పలికించాడు. ఒక దశలో ఇద్దరికి పోటీ పెట్టారట. అందులో మోహన్ బాబు నెగ్గి సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. మొదట నటుడిగా మారినా విజయాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. చాలా సినిమాల్లో విలన్ గా చేసి తానేమిటో నిరూపించుకున్నాడు.

    మళ్లీ నిర్మాతగా మారి అల్లుడుగారు నుంచి ట్రాక్ లో పడ్డాడు. తరువాత అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ లాంటి బంపర్ హిట్ సినిమాలు నిర్మించి తనకు అభిరుచి ఉందని నిరూపించాడు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉంది. తిరుపతి, హైదరాబాద్ లో ఆస్తులున్నాయి. దీంతో తన ఇద్దరు కొడుకులకు పంచాలని నిర్ణయించుకున్నాడు.

    గతంలో తన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ ఆస్తి కోసం గొడవకు దిగారు. ఈ విషయం కాస్త మీడియాకు తెలియడంతో ఏకిపారేశారు. దీంతో మోహన్ బాబు తానుబతికుండగానే ఆస్తులు పంచాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే బిడ్డకు, ఇద్దరు వారసులకు సమానంగా ఆస్తుల పంపకాలు చేస్తున్నట్లు సమాచారం. మీడియా తెలుసుకుని వెళితే వారిని దుర్భాషలాడినట్లు తెలుస్తోంది.

    పెద్దవారితో వ్యవహారాలు అలాగే ఉంటాయి. తమ ఆస్తుల పంపకంలో క్లియర్ గా ఉంటున్నా గొడవలు లేకుండా ఆస్తి పంపకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మోహన్ బాబు తన ఆస్తులను మూడు భాగాలుగా పంచుతున్నారట. దీంతో ఎలాంటి తగాదాలు లేకుండా ఆస్తులను పంచాలని మోహన్ బాబు భావిస్తున్నారు. దీని కోసం మోహన్ బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

    వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ మోహన్ బాబు అనే విషయం తెలిసిందే....