Baby ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో సినిమాను చూసే విధానంలో కూడా మార్పు వచ్చేసింది.. కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు భారీ డిజాస్టర్స్ గా నిలుస్తుంటే చిన్న చిన్న సినిమాలు సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి చిన్న సినిమాలు రిలీజ్ తర్వాత తమ సత్తా చూపిస్తున్నారు. మరి తాజాగా మన తెలుగులో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బేబీ గురించే అందరు ఇప్పుడు మాట్లాడు కుంటున్నారు. ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షోతోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషించారు. ఈ సినిమా కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్ లోనే తెరకెక్కింది.
కానీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను బాధలు కొత్తగా తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. కేజిఎఫ్ 2 సినిమాకు అప్పట్లో 12 రోజులపాటు కోటి రూపాయల వసూళ్లు వచ్చాయి.. కానీ బేబీ ఏకంగా 13 రోజుల పాటు కోటి రూపాయల కలెక్షన్స్ ను సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో కేజిఎఫ్ 2 రికార్డ్ గల్లంతు అయ్యింది. ఇది విని మరోసారి బేబీ మూవీ వార్తల్లో నిలుస్తుంది.