31.6 C
India
Sunday, May 19, 2024
More

    #OG Glimpse : ఓజీ గ్లింప్స్ చూస్తే పరేషానే?

    Date:

    #OG Glimpse :

    పవన్ కల్యాణ్ తాజా సినిమాలు విడుదల కానివి ఇంకా మూడు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో అటు సినిమాల్లో నటిస్తూ ఇటు రాజకీయాల్లో ఒకే సమయంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాజాగా ఓజీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల కావడంతో అందరిలో అంచనాలు పెరిగాయి.

    దర్శకుడు సుజిత్ చాలా రోజుల గ్యాప్ తరువాత తీస్తున్న సినిమా. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. సాహో మాదిరే ఇది కూడా గుండాగిరి ప్రధానంగా సాగే కథనం. దీంతో గ్యాంగ్ స్టర్ స్టోరీ పవన్ కు బాగా కుదురుతుందని అంటున్నారు. సినిమా టీజర్ కూడా అలాగే ఉంది. గ్యాంగ్ స్టర్ మరోమారు వస్తే ఎలా ఉంటుందనే దానిపై కథ ఆధారపడి ఉంటుంది.

    ఉస్తాద్ భగత్ సింగ్ కు కూడా కాల్షీట్లు కేటాయించడంతో అది కూడా త్వరలో పూర్తవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలాగే ఉండాలని నిరంతరం శ్రమిస్తున్నాడు. ఇంకా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఇది స్వాతంత్ర్య సమరయోధుడి కథగా చెబుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ చేతిలో సినిమాలు ఉన్నా సమయం కుదరక సినిమాల నిర్మాణం ఆలస్యం అవుతోంది.

    ఇప్పుడు కేజీఎఫ్, విక్రమ్, జైలర్ లాంటి సినిమాల్లో గ్యాంగ్ స్టర్ కథలే కనిపిస్తున్నాయి. దీంతో మన పవన్ కు కూడా ఇలాంటి కథలు బాగానే నప్పుతాయి. అందుకే ఓజీ కూడా అలాంటి కథే కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థమన్ సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈనేపథ్యంలో ఓజీపై అంచనాలు పెరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan & Mahesh : ఓజీలో మహేష్ .. గుంటూరు కారం కోసం పవన్.. ఈ వార్తల్లో నిజమెంత..?

    Pawan & Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల...

    OG Glimpse : ఓజీ గ్లింప్స్ లో కన్పించిన ఆ ఇద్దరు స్టార్స్ ఎవరో తెలుసా..!

    OG Glimpse : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్...

    #OG Update : పవన్ కళ్యాణ్ #OG అప్డేట్..

    #OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘బ్రో:...