29.5 C
India
Sunday, May 19, 2024
More

    OG : పవర్ స్టార్ ‘ఓజి’ టీజర్ నిడివి ఎంతో తెలుసా.. టైటిల్ కూడా రివీల్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్!

    Date:

    og power star movie
    og power star movie
    OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో మాములు క్రేజ్ కాదు.. పవర్ స్టార్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తూనే ఉంటారు.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఒకవైపు తన జనసేన పార్టీ పనులను చక్కబెడుతూనే మరోవైపు షూటింగులతో కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ”ఓజి” ఒకటి..
    ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. సాహో వంటి ప్లాప్ అందుకున్న కూడా సుజీత్ మీద నమ్మకంతో పవన్ అవకాశం ఇచ్చారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పుట్టిన రోజు ఉండడంతో ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాబోతున్న మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.
    దీంతో ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ టీజర్ నిడివి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఓజి టీజర్ ను సుమారు 72 సెకన్ల నిడివితో రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. టీజర్ లో పవన్ ఒరిజినల్ లుక్ ను రివీల్ చేస్తారట.. అంతేకాదు టైటిల్ కూడా ప్రకటించ బోతున్నారు అని టాక్.. ఈ టైటిల్ గురించి కూడా అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.
    ఇక ఓజి టైటిల్ గురించి ఇప్పటికే రకరకాల పేర్లు వైరల్ అయ్యాయి.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ కాదట.. పవన్ పాత్ర పేరు ఓజాసా గంభీర్ అట.. అదే పేరుతొ టైటిల్ ను ఖరారు చేసినట్టు మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంటే ఓజి టైటిల్ ‘ఓజాసా గంభీర్’ అనమాట..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : అనైతికంగా పవన్ ను తిట్టిస్తే వైసీపీకే దెబ్బ!

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రచారం ఊపందుకుంది. పార్టీల...

    TDP-Janasena : టీడీపీ-జనసేన పొత్తుకు జగన్ స్వాగతిస్తున్నారా?

    TDP-Janasena : తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    Bolisetti Satyanarayana : పొత్తుల వల్ల ఎవరికి ఉపయోగం.. జనసేనకు ఇంత తక్కువ సీట్లా?

    Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి...