23 C
India
Tuesday, October 6, 2026
More

    Pareshan collections : ‘పరేషాన్’ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే.. రానా రాణిస్తాడా..?

    Date:

    Pareshan collections
    Pareshan collections

    Pareshan collections : ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వచ్చిన చిత్రాలకే ఇప్పుడు ఆదరణ ఎక్కువగా వస్తోంది. కంటెంట్ లో బాగుంటే చాలా తక్కువ బడ్జెట్ చిత్రమైనా ఇండస్ట్రీని ఊపు ఊపేస్తుంది. ఇదే కోవలో రీసెంట్ గా వచ్చిన చిత్రం ‘పరేషాన్’ నిలుస్తుంది. రూపక్ రొనాల్డ్‌సన్ డైరెక్షన్ చేయగా సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 2వ తేదీ థియేటికల్ రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

    నూతన తారాగణం తిరువీర్, పావని కరణం, సాయి ప్రసన్న, బన్నీ అభిరాన్, అర్జున్ కృష్ణ, శృతి రియాన్  నటించిన ఈ చిత్రం పూర్తిగా తెలంగాణ నేటివిటీ, భాష, యాసకు పెద్దపీట వేసింది. ఈ సినిమా కంటెంట్‌ బాగుండడంతో రానా దగ్గుబాటి సమర్పించడంతో మరింత హైప్ సంపాదించుకుంది. టీజర్, ట్రైలర్ లో చూసిన కంటెంట్ ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా విక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం సఫలీకృతమైందనే చెప్పాలి. ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ప్రేక్షక ఆదరణ లభిస్తుంది. దీంతో 70 స్క్రీన్లు పెంచారు.

    నూతన తారాగణం, సాధారణ టెక్నీషియన్స్ తో తెరకెక్కించడంతో మోస్తరు బడ్జెట్ మాత్రమే అయ్యింది. సుమారు రూ. 3.5 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమచారం. తెలుగు రాష్ట్రాల్లో 200 స్క్రీన్లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మూడు రోజుల్లో 25 నుంచి 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

    ఇక ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్లు చూస్తే.. ఓ మోస్తరుగా ఉంది. తొలి రోజు రూ. 23 లక్షలు, రెండో రోజు రూ. 32 లక్షలు వసూలు చేసింది. మూడో రోజు రూ. 40 లక్షలు రాబట్టింది. ఆదివారం (జూన్ 4) నుంచి స్క్రీన్లు పెంచడం వల్ల సోమవారం కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పరేషాన్ సినిమా థియేట్రికల్ వ్యాల్యూను సుమారు రూ. 2 కోట్లుగా అంచనా వేశారు. సురేశ్ డిస్ట్రిబ్యూషన్ సొంతంగా రిలీజ్ చేసింది. మొత్తంగా లాభాల్లోకి రావాలంటే కనీసం రూ. 2 కోట్ల షేర్, రూ. 4 కోట్ల గ్రాస్ రాబట్టాల్సిందే. ప్రస్తుతం రూ. 90 లక్షల గ్రాస్ నమోదు చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pareshan Review : పరేషాన్ రివ్యూ అండ్ రేటింగ్!

    Pareshan Review : ఫిదా సినిమా హిట్ అయినప్పటి నుండి తెలంగాణ...

    Pareshan Movie Twitter Review.. ఆడియెన్స్ ను పరేషాన్ చేసిన తిరువీర్!

    Pareshan Movie Twitter Review : 'మసూద' సినిమాతో మంచి గుర్తింపు...