21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Pareshan Movie Twitter Review.. ఆడియెన్స్ ను పరేషాన్ చేసిన తిరువీర్!

    Date:

    Pareshan Movie
    Pareshan Movie

    Pareshan Movie Twitter Review : ‘మసూద’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్.. ఇతడు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కష్టంతో హీరోగా నిలబడ్డాడు.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘పరేషాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు..

    ఇక ఈ సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించగా వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.

    సోషల్ మీడియా వేదికగా పరేషాన్ టీజర్, ట్రైలర్, పాటలు వైరల్ అయ్యాయి.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీమియర్ షో వేయగా ఈ సినిమాను వీక్షించిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రానా ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా ఎంతో కొంత బాగుండే ఉంటుంది అని అంతా అనుకున్నారు..

    కానీ ప్రేక్షకుల నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టుకోలేక పోయింది అని రివ్యూలు వస్తున్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో లేని అలవాట్లు, పద్ధతులు చూపించారని ఈ సినిమాలో కామెడీ కంటెంట్ తప్ప మరో కంటెంట్ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది పెద్ద వరస్ట్ సినిమా అంటూ చెప్పేస్తున్నారు. రానా ఎందుకు ఇలాంటి సినిమాను ప్రమోట్ చేస్తున్నారో అర్ధం కాలేదని ఒక ఆడియన్ ట్వీట్ చేసారు.. మరొక ఆడియెన్ పరేషాన్ తో పరేషాన్ అయ్యాను అంటూ ట్వీట్ చేసాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pareshan collections : ‘పరేషాన్’ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే.. రానా రాణిస్తాడా..?

    Pareshan collections : ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వచ్చిన చిత్రాలకే...

    Pareshan Review : పరేషాన్ రివ్యూ అండ్ రేటింగ్!

    Pareshan Review : ఫిదా సినిమా హిట్ అయినప్పటి నుండి తెలంగాణ...