34.7 C
India
Friday, May 17, 2024
More

    Pareshan Review : పరేషాన్ రివ్యూ అండ్ రేటింగ్!

    Date:

    Pareshan Review
    Pareshan Review

    Pareshan Review : ఫిదా సినిమా హిట్ అయినప్పటి నుండి తెలంగాణ నేపథ్యంలో వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి.. అన్ని కూడా హిట్ అవుతూనే ఉన్నాయి.. ఫిదా, లవ్ స్టోరీ, దసరా, జాతిరత్నాలు, బలగం, మేమ్ ఫేమస్ ఇలా ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉన్నాయి. వీటిలో బలగం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది.

    అయితే తెలంగాణ కల్చర్ ను దారుణంగా పెడదోవ పట్టించే సినిమాలు వస్తు ఉండడం ఇప్పుడు అందరు చర్చించు కుంటున్నారు.. ముఖ్యంగా తెలంగాణ అంటేనే తాగుడుకు బ్రాండ్ అంబాసిడర్ లా చుపిస్తున్నారు.. మరి తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన ‘పరేషాన్’ సినిమా కూడా ఇలానే తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది.. ‘మసూద’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్..

    ఇతడు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కష్టంతో హీరోగా నిలబడ్డాడు.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘పరేషాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు.

    ఈ సినిమాకు దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించగా వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పరేషాన్ టీజర్, ట్రైలర్, పాటలు వైరల్ అయ్యాయి.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులోనూ తాగుడే చూపించారా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

    కథ :

    ఐజాక్ (తిరువీర్) ఐటీఐ ఫెయిల్ అయి పనీపాటా లేకుండా ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరుగుతూ ఉండేవాడు.. తాగుడు, కొట్లాటలతోనే ఈయన కాలం గడిపేవాడు.. దీంతో ఈయన తండ్రి తన సింగరేణి ఉద్యోగం కొడుక్కి ఇప్పించి లైఫ్ లో సెటిల్ చేయాలనుకుంటాడు. ఉదోగ్యం కోసం పైరవీకి లంచం ఇవ్వాలని అనుకుంటే ఆ డబ్బును ఐజాక్ ఆపదలో ఉన్న ఫ్రెండ్స్ కు ఇస్తాడు.. ఈ విషయంలోనే తండ్రికి, కొడుకుకి రోజు పంచాయితీ..  అలాగే మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీషతో కలవడంతో గర్భవతి అవుతుంది.. మరి ఈ సమస్యలను ఎలా సాల్వ్ చేసాడు అనేది మిగిలిన కథ..

    విశ్లేషణ : తెలంగాణ కల్చర్ ఇన్నాళ్లు వెండితెర పైకి రాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా కథలు వస్తూనే ఉన్నాయి.. ముందుగా మంచి మంచి కథలు వచ్చేవి కానీ ఇప్పుడు పెడదోవ పడుతున్నారు.. తెలంగాణ అంటే తాగుడు వంటివి చూపిస్తూ తెలంగాణ కల్చర్ ను నాశనం చేస్తున్నారు.. ఇది బాధాకరం అనే చెప్పాలి.. పరేషాన్ తో కూడా ఇదే చేసారు అనే చెప్పాలి.. సినిమాలో 80 శాతం మందు బాటిల్, బీర్ బాటిల్ ఉన్న సీన్లతో సాగుతుందంటే అతియసోక్తి కాదు..

    తాగుడు అందం పక్కన పెడితే పరేషాన్ మంచి ప్రయత్నంగా చెప్పాలి.. తెలంగాణ యూత్ మాత్రమే ఈ సినిమాకు కనెక్ట్ అయ్యేలా ఉంది.. అయితే తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఇలా జరగదు కాబట్టి చాలా మంది కోపంగా ఉన్నారు.. కొంత కామెడీ మాత్రమే అలరించేలా ఉంది.. ఇది మంచి అటెంప్ట్ అయిన ఆడియెన్స్ లో కొంత పరేషాన్ తెప్పింస్తుంది..

    నటీనటులు :

    తిరువీర్,
    అర్జున్ కృష్ణ,
    బన్నీ అభిరన్,
    మురళీధర్ గౌడ్,
    పద్మ,
    వసంత

    రేటింగ్ : 2/5

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pareshan collections : ‘పరేషాన్’ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే.. రానా రాణిస్తాడా..?

    Pareshan collections : ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వచ్చిన చిత్రాలకే...

    Pareshan Movie Twitter Review.. ఆడియెన్స్ ను పరేషాన్ చేసిన తిరువీర్!

    Pareshan Movie Twitter Review : 'మసూద' సినిమాతో మంచి గుర్తింపు...