![Varun and Lavanya](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/06/Safeimagekit-resized-img-19-2.jpeg)
Varun and Lavanya : వరణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. జూన్ 9నే వారి ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకకు అందరు హాజరయ్యారు. ఒక్క పవన్ కల్యాణ్ మాత్రం షూటింగ్ బిజీలో ఉండి రాలేకపోయారు. కానీ తరువాత వచ్చి వారి జంటను ఆశీర్వదించారు. బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ నిలుస్తోంది.
మెగా కుటుంబంలో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజీ ఏ పాటిదో తెలిసిందే. దీంతో ఆయన ఉన్నారంటే సందడే సందడి. అక్కడ అభిమానులు వాలిపోతుంటారు. వారి కుటుంబంలో కూడా అందరు పవన్ కల్యాణ్ ను అలాగే చూస్తారు. అందరికి ఆత్మీయుడిగా ఆయనకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. ఇక అభిమానుల సంగతి వేరే చెప్పనక్కర లేదు. అలా పవన్ కల్యాణ్ వారి కుటుంబంలో ముఖ్యుడయ్యాడు.
ప్రస్తుతం ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే వారి నిశ్చితార్థానికి రాలేకపోయినా మరునాడు వచ్చి వారికి బొకే అందించి శుభాకాంక్షలు చెప్పి వారితో ఫొటో దిగాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ వేసుకున్న చొక్కా ధర రూ. 10 లక్షలు ఉంటుందట. అంటే మధ్య తరగతి కుటుంబం కొన్ని రోజుల పాటు బతకొచ్చు.
వరుణ్, లావణ్య జంట చూడముచ్చటగా ఉందని అందరు ప్రశంసిస్తున్నారు. ఈడు జోడు బాగుందని కితాబిస్తున్నారు. ఒకరి కోసం మరొకరు పుట్టినట్లుగా ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరుగుతుందని తెలుస్తోంది. ఇక మెగా వారి ఇంట్లో సందడే సందడి అని చర్చించుకుంటున్నారు. వరుణ్, లావణ్యల వివాహంపై అందరిలో ఆసక్తి నెలకొంది.