Free Bus Travel : తెలంగాణ ప్రభుత్వం బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి ఆమోదం కల్పించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్ 8న జారీ చేసిన జీవో నెంబర్ 47ను సవాలు చేస్తూ హరేందర్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం సరికాదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేస్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ఇలాంటి పథకాలు పెట్టడం వాస్తవ విరుద్దమన్నారు. జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి వివక్షతో కూడిన నిర్ణయమేనని తేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పుబట్టారు.
రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే ఇలాంటి పథకాలు ప్రభుత్వం తీసుకురావడం కరెక్టు కాదని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీని కుంగదీసే పథకాల ఏర్పాటుతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. ప్రభుత్వం తన తప్పును తెలుసుకుని ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
వ్యాజ్యంలో ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, చైర్మన్ లను చేర్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యులుగా చేర్చారు. ప్రస్తుతం దీనిపై విచారణ త్వరలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బస్సుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పురుషులకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దీనిపై పోరాడతామని తమ వైఖరి వెల్లడించారు.