Free Loans : తెలంగాణ: స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రాబోయే ఐదు సంవత్సరాలలో రూ .లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క వెల్లడించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. మరో వైపు తనకు ఖమ్మం సీటు రాకుండా భట్టీ విక్రమా ర్క పార్టీ పడుతున్నా రని విహెచ్ హనుమంత రావు ఆరోపించారు.
తెలంగాణలో ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా సంక్షేమ కార్యక్ర మాలను ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతుంది. స్వయం సహాయక సంఘాల వారికి వడ్డీ లేని రుణాలు నిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసు కుందని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తెలిపారు.