KCR VS YSR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసే ప్రసంగాలు సహజంగానే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రతిపక్షాలపై చేసే విమర్శలు, సైటైర్లు ఆకట్టకుంటున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్ మొదలైనప్పటి నుంచి కేసీఆర్ ను అనుకరిస్తూ గతంలో ఎంతో మంది డబ్ మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేయగా , ఇప్పుడు ఇన్స్టా వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
అదే తరహాలో అసెంబ్లీలో కేసీఆర్ దివంగత నేత వైఎస్సార్ కు మాట్లాడే అవకాశం ఇచ్చిన వీడియోలు కూడా ఇప్పడు వైరల్ అవుతున్నాయి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఇవ్వడమేంటని అనుమానాలు తలెత్తుతున్నాయి.
అసలు విషయం ఇదీ
వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనభాపక్ష నేతగా వ్యవహరించారు. అలాగే పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999 లో టీడీపీ చంద్రబాబు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ టీడీపీ నుంచి గెలిచారు. అప్పడు మంత్రి వర్గ విస్తరణలో ప్రతిభా భారతిని స్పీకర్ గా,
సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా చంద్రబాబు నియమించారు. స్పీకర్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అధికారం ఉంటుంది. ఇదే అవకాశం అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే కేసీఆర్ కు వచ్చింది. అప్పటి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ర్టంలోని సమస్యలపై అధికార పార్టీపై అసెంబ్లీలోనే విరుచుకుపడేవారు. ఆ సమయలో అధికార పార్టీ నుంచి సరైన సమాధానాలు రాకపోగా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడి గా ఎదురుదాడికి దిగేవారు. వైఎస్సార్ సమస్యలు ఎత్తి చూపకుండా అప్పటి అధికార పక్షం టీడీపీ రాజశేఖరరెడ్డి మాట్లాడుతుండగా మైక్ కట్ చేయించిన సందర్బాలు ఉన్నాయి. వీటిని స్వయంగా వైఎస్సారే సభలో ప్రస్తావించారు. తను మాట్లాడుతుండగా మైక్ కట్ చేస్తున్నారే తప్ప సమాదానాలు ఇవ్వడం లేదని కూడా వైఎస్సార్ ప్రశ్నించారు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాడు. కానీ ప్రతిపక్షనేతకు అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా పూర్తి్స్థాయిలు అడ్డుకునేందుకు చంద్రబాబుకు సాద్యం కాలేదు.
వైఎస్ కు అవకాశం ఇచ్చిన కేసీఆర్
డిప్యూటీ స్పీకర్ గా పలు సందర్భాల్లో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో కేసీఆర్ ప్రతిపక్ష నేత వైఎస్సార్ కు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ వీడియో ఎప్పటి నుంచో నెట్లో ఇప్పడు వైరల్ అవుతున్నది. అధికా పక్షంలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు పూర్తిస్థాయిలో అవకాశం కల్పించారు.
View this post on Instagram