European Countries : యూరప్ లో రైతు ఉద్యమాలు కొసాగుతున్నాయి. గతంలో మన దేశంలో పెను ప్రభావం చూపిన రైతు ఉద్యమాలు ఇప్పడు యూరప్ దేశాలను కుదిపేస్తున్నాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాల్లో మునిగిపోతున్నారు. దీంతో రైతులు ఉద్యమించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు తమ సమస్యలు తీర్చాలని గగ్గోలు పెడుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. రైతులకు అందించాల్సిన సబ్సిడీ అందడం లేదు. అందుకే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ మీద టమాటాలు, రాళ్లు రువ్వారు. పంటలకు సబ్సిడీ ఎత్తివేడయంతో నష్టాల బారిన పడుతున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రైతు ఉద్యమాలు పెరుగుతున్నాయి.
జర్మనీ, దక్షిణాఫికా, బెర్లిన్ లాంటి దేశాలు ఆహార పంటల సాగుకు ముందుకు రావడం లేదు. దీని వల్ల కలిగే అనర్థాలే వారిని కుంగదీస్తున్నాయి. యూరప్ దేశాల్లో నెలకొన్న కరువుతో అన్ని దేశాలు క్షోభను అనుభవిస్తున్నాయి. ఇజ్రాయెల్, గాజా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు ఆహార ఉత్పత్తులు సరఫరా చేసే ఉక్రెయిన్ యుద్ధంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
ఈ క్రమంలో యూరోపియన్ దేశాలు పేదరికంలోకి జారుకుంటున్నాయి. ఆహారం కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. ధరల పెరుగుదల ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో యూరోపియన్ దేశాల బాధలు వర్ణనాతీతం. ఐరోపా దేశాల బాధలు తీర్చాలంటే అక్కడ పంటల సాగుకు రైతులు ముందుకు రావాల్సిందే. యూరప్ దేశాలను పీకల్లోతు కష్టాల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.