30.4 C
India
Tuesday, May 14, 2024
More

    Producer Anji Reddy Murder case : లిఫ్ట్ లో చంపి.. సెల్లార్ లో పడేసి.. సంచలనం సృష్టించిన నిర్మాత మర్డర్ కేసు

    Date:

    Producer Anji reddy Murder case
    Producer Anji reddy Murder case

    Producer Anji Reddy Murder case : కోట్లాది రూపాయల ఆసక్తిని కొట్టేసేందుకు పథకం వేశారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టడంతో చంపి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించే లోగా పోలీసులకు చిక్కారు. అసలు ఏం జరిగిందంటే?

    సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లో సినీ నిర్మాత అంజిరెడ్డి (71) ఉండేవాడు. ఇటీవల ఆయన హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గోపాలపురం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. చెలికాడు, దొంగ అల్లుడు తదితర చిత్రాలను ఆయన నిర్మించాడు. ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె. అందులో ఒక కుమారుడు మోకిలలో ఉంటుండగా మరో కొడుకు, కూతురు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాము కూడా అమెరికాకే వెళ్లాలని అంజిరెడ్డి దంపతులు అనుకున్నారు.

    దీంతో పద్మారావునగర్ లోని తమ ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. సినీ రంగానికి చెందిన ఫొటో గ్రాఫర్ డీ రవి రెజిమెంటల్ బజార్ లోని డీమార్ట్ పైనగల జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేశ్ వద్దకు తీసుకెళ్లాడు. ఇంటిని చూసిన రాజేశ్ సొతం చేసుకోవాలని అనుకున్నాడు. స్థిరాస్తి వ్యాపారులకు అమ్మిపెడతానని హామీ ఇచ్చారు.

    సెప్టెంబర్ 29న అంజిరెడ్డిని రాజేశ్ పలిపించుకున్నారు. కన్వెన్షన్ వెళ్లాడు అంజిరెడ్డి. అక్కడి నుంచి అంజిరెడ్డి, రాజేశ్, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి మేడ్చల్ వైపునకు వెళ్లారు. అయితే అంజిరెడ్డితో ఆస్తి పత్రాలపై అక్కడే సంతకాలు చేయించుకోవాలని వారు అనుకున్నారు. వారి పథకంలో భాగంగా ఒక చోట దాడి చేశారు. అయినా అంజిరెడ్డి వారికి లొంగలేదు. దీంతో అందరూ కలిసి మళ్లీ కన్వెన్షన్ వద్దకు చేరుకున్నారు. పైన ఉన్న ఆఫీస్ లోకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. అందులో జరిగిన గొడవతో ముగ్గురు అంజిరెడ్డిపై దాడి చేసి చంపేశారు.

    అనంతరం డెడ్ బాడీని డీమార్ట్‌ భవనంలోని మూడో సెల్లార్‌కు తీసుకెళ్లారు. అంజిరెడ్డి కారును సెల్లార్‌లోని పిల్లర్‌కు ఢీకొట్టారు. కారు తీస్తున్న క్రమంలో ప్రమాదానిక గురై అంజిరెడ్డి మరణించినట్లు చిత్రీకరించాలని అనుకున్నారు. అదే రోజు రాత్రి 9.15 గంటలకు అంజిరెడ్డి కొడుకు చరణ్ రెడ్డి ఫొటో గ్రాఫర్ రవికి ఫోన్ చేశాడు. దీంతో ఆయన డీమార్ట్ బేస్ మెంట్ పార్కింగ్-3లో జరిగిన ప్రమాదంలో అంజిరెడ్డి చనిపోయినట్లు చరణ్ రెడ్డికి చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్ అంజిరెడ్డి కొడుకు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

    సెప్టెంబర్ 30వ తేదీ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించిన ఆధారాలతో అంజిరెడ్డిని హత్య చేశారని, పథకం ప్రకారమే జరిగిందని నిర్ధారించారు. ఇందులో ప్రధాన నిందితుడిగాఉన్న రాజేశ్ తో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు బిహారీలు ఉన్నారని వారు రాజేశ్ వద్ద పని చేసే వ్యక్తులే అని. హత్యకు సంబంధించి ఎటువంటి సుపారీ తీసుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    Van Overturned : వ్యాన్ బోల్తా.. తవుడు బస్తాల మధ్య డబ్బుల పెట్టెలు

    Van Overturned : తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు వ్యాన్ లో...

    Engagement : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్..  బాలిక తల నరికిన వరుడు

    Engagement Cancel : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...