39 C
India
Sunday, May 19, 2024
More

    Neha Shetty : రాధిక ఎంట్రీ మళ్ళీ ఉంటుందట.. ‘టిల్లు స్క్వేర్’లో నేహా శెట్టి.. నిజమేనా?

    Date:

    Nehashetti
    Nehashetti

    Neha Shetty : టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఒక్క సినిమాతో పాపులర్ అయిన భామల్లో నేహా శెట్టి ఒకరు.. ఈమె డీజే టిల్లు సినిమాతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది.. ఈ సినిమా తర్వాత అమ్మడి ఫేమ్ ఎక్కడికో వెళ్లి పోయింది.. రాధికా పాత్రలో ఈ అమ్మడు గ్లామర్ ఒలికించి భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోయిన్ అవుతుంది అని అనుకున్న ఈ భామకు అవకాశాలు ఆశించిన స్థాయిలో రాలేదు..

    వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదుగు తుంది అని భావించిన ఈమెకు నిరాశ తప్పలేదు. అడపాదడపా అవకాశాలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆఫర్స్ అందుకోలేక పోతుంది.. కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది.

    సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి రొమాన్స్ ఆడియెన్స్ ను బాగా అలరించింది. అందుకే మొదటి సినిమా తోనే ఈమె కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది.. ఇక తాజాగా వినిపిస్తున్న గాసిప్ ప్రకారం డీజే టిల్లు సీక్వెల్ లో కూడా ఈ భామ కనిపిస్తుంది అని టాక్.. టిల్లు స్క్వేర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ లో ఈసారి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచేశారు. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో ఈ భామ కూడా నటిస్తుందట..

    ఈ సినిమా క్లైమాక్స్ లో రాధికా పాత్రతో నేహా శెట్టి మళ్ళీ ఎంట్రీ ఇస్తుందని టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది.. సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.. ప్రస్తుతం ఈ భామ కార్తికేయతో కలిసి బెదురులంక 2012 తో పాటు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...