
Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిందని తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఒకటి, రెండు సార్లు అటు ఇటుగా మారింది. తాజాగా ఈ సినిమా ఫ్రాంచైజీలో మూడో భాగమైన ‘టిల్లు క్యూబ్’ను ప్రకటించారు మేకర్స్. టిల్లు సిరీస్ మొదటి భాగం ‘డీజే టిల్లు’ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మేరకు టైటిల్ కార్డ్ జోడించి కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ చివరి షెడ్యూల్ మొదలు పెట్టారు మేకర్స్.
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో ఫ్రాంచైజీల జమానా కొనసాగుతోంది. అంటే ఈ ఫ్రాంచైజీ కింద ప్రతీ సంవత్సరం ఒక సినిమా వస్తుంటుందన్నమాట. డీజే టిల్లుతో ఆగకుండా టిల్లు స్క్వేర్ కు తీసుకువచ్చిన మేకర్స్.. ఇప్పుడు టిల్లు క్యూబ్ కు శ్రీకారం చుడతామని ప్రకటించారు.
టిల్లు స్క్వేర్ రెండో రోజు థియేట్రికల్ రన్ నుంచి మాత్రమే ఈ సినిమాలో టైటిల్ కార్డ్ యాడ్ కావడం గమనార్హం. టిల్లు స్క్వేర్ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో కూడా భారీగా స్క్రీన్లను దక్కించుకుంది. అదే సమయంలో గతంలో డీజే టిల్లు కామెడీని సమర్థవంతంగా ప్రతిభింబించినందుకు విమర్శకుల ప్రశంసలను పొందింది.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందించగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించారు.
టిల్లు స్క్వేర్ లో చాలా వరకు డైలాగులు సిద్ధూనే రాశాడంటే అతిశయోక్తి కాదు. రిలీజైన ఒకటి, రెండు రోజుల్లోనే భారీ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది ఈ మూవీ. టిల్లు క్యూబ్ తో పాటు స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్: కొంచెమ్ క్రాక్’ చిత్రాలను సిద్దు జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు.