39 C
India
Sunday, May 19, 2024
More

    Rashmika Morphing Video Viral : రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి ఏమన్నారంటే?

    Date:

    Rashmika Morphing Video Viral
    Rashmika Morphing Video Viral

    Rashmika Morphing Video Viral : టాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా అత్యంత ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉన్నవారి గురించి చెప్తే రష్మిక మందన్న ఉండి తీరుతుంది. ఈ అమ్మడి సోషల్ మీడియా ఖాతాలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకేనేమో ఆమకు సంబంధించిన వార్త అయినా.. ఫొటో అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. రీసెంట్ గా రష్మికకు సంబంధించి ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై సాక్షాత్తు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారంటే దాని తీవ్రత ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది.

    రష్మిక మందన డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకొని లిఫ్ట్ లో ఉన్నట్లు మార్పింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు ఇలాంటి మార్ఫింగ్ లతో వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర భంగం కలుగుతుందని అని చెప్తున్నారు. మొదట్లో కొంత మంది నిజమే అనుకున్నారు. ఆ తర్వాత ఒరిజినల్ వీడియోను ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేయడంతో క్లారిటీ వచ్చింది. ఒరిజినల్ వీడియోలో ఉంది జరా పటేల్ అనే యువతని, రష్మిక కాదని స్పష్టమైంది. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు చట్ట పరంగా నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    అత్యంత ప్రమాదకరం: కేంద్ర ఐటీ శాఖ
    రష్మిక మార్ఫింగ్ వీడియోను వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. పౌరుల ప్రతిష్టకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారన్నారు. ఈ ఏడాదిలో వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియాలోని కొన్ని ప్లాట్ పారాలు చట్ట పరమైన ఆదేశాలు పాటించాలి. తమ ప్లాట్ ఫారం లో నకిలీ, తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా చూడాల్సిన బాధ్యత వారిపైనే నిర్వాహకుల పైనే ఉంటుందన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ఉంటే వాటిని 36 గంటల్లో తొలగించాలి. లేదంటే సదరు సమాజిక మాద్యమాన్ని కోర్టుకు లాగవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

    రష్మిక వీడియోపై బిగ్ బీ స్పందన..
    ఈ వీడియోపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా స్పందించారు. దీన్ని సృష్టించి పోస్ట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక రష్మిక కెరీర్ పరంగా దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో చాలా ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.
    రణ్‌బీర్‌ కపూర్ తో కలిసి చేసిన  ‘యానిమల్‌’ డిసెంబర్‌ 1వ తేదీ పాన్ వరల్డ్ గా రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప-2’లోనటిస్తోంది. వీటితో పాటు మరో మూడు అతిపెద్ద ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Animal New Poster : యానిమల్ ఫస్ట్ సింగిల్.. రణబీర్, రష్మిక లిప్ లాక్. పోస్టర్ అదరగొట్టాడు!

    Animal New Poster : బాలీవుడ్ సినిమాల్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పాన్...

    Rashmika Mandanna : బ్లౌస్ లు ఉన్నా లేనట్టే.. రష్మిక స్టన్నింగ్ లుక్స్.. చూసి తట్టుకోగలరా..!

    Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ఎవ్వరికి...