35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Revanth vs Uttam : రేవంత్ వర్సెస్ ఉత్తమ్.. పీఈసీ సమావేశంలో వాగ్వాదం

    Date:

    Revanth vs Uttam :
    ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.  గాంధీభవన్‌లో నిర్వహించిన పీఈసీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఆశావహుల జాబితాను స్క్రూటినీ చేసేందుకు పీసీసీ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ  మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. దాదాపు మూడున్నర గంటల పాటు కమిటీ సమావేశం జరిగింది.
    నల్గొండ సీటు త్యాగానికి సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి
    ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన స్థానాలపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరు అభ్యర్థుల అంశంపై పీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదన చేయాలని ఉత్తమ్‌ పట్టుబట్టినట్టు సమాచారం. ఒకే కుటుంబంలో రెండు టికెట్లపై తాను ఎలాంటి ప్రతిపాదన చేయబోనని, అంతా అధిష్ఠానం చూసుకుంటుందని రేవంత్‌ చెప్పినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా  నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఉత్తమ్‌ అనడంతో తనను డిక్టేట్‌ చేయవద్దని రేవంత్‌ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. అభ్యర్థుల విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వచ్చే నెల రెండో తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
    కాగా అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు పై ఎంపీ కోమటిరెడ్డి  చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. నల్గొండ నియోజకవర్గానికి ఆరు దరఖాస్తులు వచ్చాయని, బీసీల కోసం తన సీటును వదిలేసుకోవడానికి సిద్ధమమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...