35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Samantha : రెమ్యునరేషన్ వెనక్కిచ్చేసిన సమంత.. అమ్మడు మంచి మనసుకు నెటిజెన్స్ ప్రశంసలు!

    Date:

    Samantha who returned the remuneration for kushi movie
    Samantha who returned the remuneration for kushi movie

    Samantha :

    ఒక సినిమా ఎంతో కష్టపడి చాలా బడ్జెట్ పెట్టి చేస్తే హిట్ అయితే ఓకే.. అందరికి పేరు వస్తుంది.. నిర్మాతలకు కూడా లాభాలు వస్తాయి.. అదే సినిమా భారీ బడ్జెట్ తో తీయగా ప్లాప్ అయితే నిర్మాతలు తీవ్ర కష్టాల్లో కూరుకు పోతారు. ఈ మధ్య కాలంలో చాలా మంది నిర్మాతలకు కోట్లకు కోట్లు నష్టాలు వాటిల్లుతున్నాయి..
    అయితే సినిమా ప్లాప్ అయినప్పుడు కొంత మంది హీరోలు, డైరెక్టర్లు తమ పారితోషికాలను వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు.. ఆ చిన్న మొత్తం వెనక్కి ఇచ్చిన నిర్మాతలకు ఊరటగా ఉంటుంద్సి. అలాంటి వారిని రియల్ హీరోస్ అంటారు. ఈ విషయంలో హీరోయిన్లు ఎప్పుడు పట్టించుకోరు.. వారి పారితోషికం ముందే అందుకుని సైలెంట్ గా ఉంటారు.. అయితే ఈ రూల్ ను సామ్ మార్చేసింది..
    ఈ విషయం హీరోయిన్లు తక్కువ కాదని నిరూపించింది. ప్రస్తుతం ఈ భామ నటించి ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు..అయితే ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అవ్వాల్సి ఉండగా సామ్ ఆరోగ్య సమస్య కారణంగా వాయిదా పడింది. మరి ఒక సినిమా దాదాపు ఏడాది పాటు వాయిదా పడితే నిర్మాతలపై భారీ వడ్డీల భారం పడుతుంది అనే విషయం తెలిసిందే..
    దీంతో ఖుషి సినిమాకు కూడా తన వల్ల సినిమా ఆలస్యం అయినందుకు పరిహారంగా సామ్ తన పారితోషికాన్ని తగ్గించు కుందట.. ఈ సినిమా కోసం సామ్ కొంత అడ్వాన్స్ తీసుకోగా మిగిలిన మొత్తంలో సగం సినిమా షూటింగ్ మధ్యలో తీసుకుంది.. మిగిలిన భాగంలో దాదాపు కోటి రూపాయల పారితోషికం తగ్గించుకున్నట్టు టాక్.. శాకుంతలం విషయంలో కూడా నిర్మాతకు కొంత తిరిగి ఇచ్చింది. ఇలా ఈ భామ తన మంచి మనసు చాటుకుంటుంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...