Sankranti Celebrations 2024 : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటాక్స్) రిక్ రెడ్డి హైస్కూల్, ఫ్రిస్కోలో ఏర్ాటు చేసిన సంక్రాంతి వేడుకలు వైభవంగా జరిగాయి. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు, కార్యక్రమ సమన్వయకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి, కల్చరల్ సమన్వయ కర్త దీప్తి సూర్యదేవర సంయుక్తంగా వేడుకలు జరిపించారు.
సంక్రాంతి సంబరాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. స్థానిక ఇండియన్ రెస్టారెంట్ సురవి వారు ఆహుతులందరికి నోరూరించే వంటకాల్ని రుచి చూపించారు. అచ్చమైన తెలుగు వాతావరణం ప్రతిబింబించేలా మన విశిష్టతను వివరించారు. శాస్త్రీయ సంగీతం అత్యంత ప్రతిభా మూర్తులైన చిన్నారులు, సాహితీ వేముల, సింధూర వేముల, సమన్విత మాడ శ్రీరామ నామ భక్తిరస గీతాన్ని ఆలపించారు. అమెరికా జాతీయ గీతం వినిపించడంతో కార్యక్రమం ప్రారంభించారు.
భోగి, సంక్రాంతి, కనుమ పండగలకు గుర్తుగా రుచికరమైన పిండివంటలు వండారు. తెలుగు వారి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే గొబ్బెమ్మలు, గాలిపటాలు, గంగిరెద్దుల పోటీలు, హరిదాసులను జ్ణాపకం చేసుకోవడం విశేషం. రాముడు, క్రిష్ణుడిని భక్తితో తలుచుకుని పలు ప్రదర్శనలు చేశారు. జయ దుర్గే, శంభో మహదేవ అంటూ అలరించారు.
నాలుగు గంటల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అతిరథ మహారథులు ఆస్వాదించారు. వినోదాన్ని సంతోషంగా వీక్షించారు. విందు భోజనాలు రుచిచూశారు. సంక్రాంతి సంబరాలను ప్రత్యేకంగా జరిపారు. సంక్రాంతి వేడుకలు వైభవంగా జరిపి అందరికి సంతోషాలు నింపారు. ఎంతో మంది విచ్చేసి సంబరాల వేడుకలను కళ్లారా తిలకించి చర్చించుకున్నారు.