38.1 C
India
Sunday, May 19, 2024
More

    Chandramohan Passed Away : సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!

    Date:

    Chandramohan Passed Away
    Chandramohan Passed Away
    Chandramohan Passed Away : సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించారు.. సీనియర్ నటులలో చంద్రమోహన్ ఒకరు.. ఈయన ఈ రోజు తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది.. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన ఈ రోజు లేరు అనే వార్త బయటకు రావడంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి..
    కథానాయకుడుగా ఎన్నో సినిమాల్లో చేసిన ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.. మరి అలాంటి స్టార్ హీరో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు..

    చంద్రమోహన్ 1942 మే 23న జన్మించారు. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా సినిమాల్లో నటించాడు. మొత్తం 932 సినిమాల్లో నటించాడు. చాలా వరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేశాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. శ్రీదేవి తన తొలి సినిమాను చంద్రమోహన్ హీరోగానే చేయడం విశేషం. తర్వాత ఫ్లాపులు రావడం.. అవకాశాలు తగ్గిపోవడంతో అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

    కొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తోనే తొలి చిత్రంలో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.

    చంద్రమోహన్ వయసు ప్రస్తుతం 82 ఏళ్ళు.. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. ఈయన మరణ వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు అంత సంతాపం తెలుపుతున్నారు.. హైదరాబాద్ లో ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కృష్ణతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్న చంద్రమోహన్

    సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు సీనియర్ నటులు చంద్రమోహన్....