34.7 C
India
Friday, May 17, 2024
More

    UP CM Yogi : మాతృభూమికి సేవ చేయండి..యూపీ సీఎం యోగి కొత్త స్కీం!

    Date:

    UP CM Yogi
    UP CM Yogi

    UP CM Yogi : విదేశాల్లో ఉంటున్న భారతీయులు మాతృభూమికి సేవ చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.ఈ మేరకు మాతృభూమి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద, విదేశాల్లో స్థిరపడిన UP ప్రజలు వారి స్వగ్రామాల్లో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థికంగా సహకరించడానికి అనుమతి ఇస్తారు.

    ఈ పథకం కింద, ప్రభుత్వం ప్రాజెక్టులో 40% ఆర్థిక సాయం అందిస్తుంది. భూమిని కూడా ఇస్తుంది. మిగిలినది NRIలు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ఎన్‌ఆర్‌ఐలను తమ మూలాలతో అనుసంధానం చేసేందుకు ఇది తోడ్పడుంది. మాతృభూమి పథకం ప్రస్తుతం యూపీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నామని, త్వరలో పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామనని సీఎ తెలిపారు.

    స్వర్గం కంటే తల్లి, మాతృభూమి గొప్పవని, వాటి మధ్య పోలిక ఉండదని, అందుకే ప్రతి ఒక్కరికీ మాతృభూమి పథకంలో భాగస్వామ్యం కల్పించాలని, ఈ పథకం రెండు ప్రయోజనాలను అందజేస్తుందని, వారిని వారి మూలాలకు అనుసంధానం చేస్తుందని  యోగి వెల్లడించారు. వారి మాతృభూమి కోసం సహకరించేందుకు ముందుకు రావాలని కోరారు.

    దుర్వనియోగం కానివ్వం

    ప్రభుత్వానికి పంపితే తమ సొమ్ము దుర్వినియోగం అవుతుందేమోనన్న భయాందోళనలకు లోనవుతున్నారని, డబ్బులు జమ చేసిన వారికే ఖర్చుల ఖాతా ఇచ్చేలా యంత్రాంగాన్ని రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖకు సూచించారు.

    పంచాయతీలను స్మార్ట్‌గా మార్చేందుకు కృషి

    పంచాయతీలను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని సీఎం తెలిపారు. గ్రామ సచివాలయం, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, పారిశుద్ధ్య సౌకర్యాలు, LED వీధి దీపాలు, మంచి రోడ్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరాలు ఉన్నాయి.

     కాలిఫోర్నియా నివాసి వివేక్ చౌదరి సీఎంతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. గతంలో టాలీవుడ్ లో మహేశ్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో సంచలనం రేపింది. రాష్ట్రంలోని చిన్న చిన్న పల్లెలు, పట్టణాల నుంచి నగరాలకు, విదేశాలకు వెళ్లి స్ధిరపడిన శ్రీమంతులు తాము పుట్టిన గడ్డకు తిరిగొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావడం అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సరిగ్గా ఇప్పుడు ఇదే కాన్పెప్ట్ ను యూపీలో అమలు చేసేందుకు అక్కడి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక పథకం ప్రారంభించింది

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    American Youth : అమెరికన్ యువత దిగజారిపోయారా?

    American Youth : ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని...

    Tagore Mallineni : తానా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశల వ్యాప్తి చేస్తా మీడియాతో ఠాగూర్ మల్లినేని

    Tagore Mallineni : కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఉత్తర కరోలినా...

    NRI BJP : గోశామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ కోసం కదిలివచ్చిన ప్రవాస భారతీయులు

    NRI BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం లోకి ఎన్నారైలు దిగారు. అమెరికా...

    TACA Diwali Celebrations : టోరంటోలో TACA దీపావళి వేడుకలు..

    TACA Diwali Celebrations : తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా-TACA)...