28.5 C
India
Friday, May 3, 2024
More

    American Youth : అమెరికన్ యువత దిగజారిపోయారా?

    Date:

    American Youth
    American Youth

    American Youth : ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని వందేళ్ల కిందటే మన తెలుగు కవి గురజాడ గొంతెత్తి పాడారు. ఒక దేశమంటే అక్కడి మట్టి కాదు.. వనరులు కాదు.. అక్కడుండే మనుషులు.. వారి హక్కులు.. వారి స్వేచ్ఛా స్వాతంత్ర్యం. ఇవన్నీ కాపాడినప్పుడే ఆ దేశ సార్వభౌమత్వం వెల్లివిరుస్తోంది.

    ప్రస్తుత ప్రపంచంలో ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ వార్, మరోవైపు ఇజ్రాయెల్- హమాస్ వార్.. ఇలా పలుచోట్ల మానవ హక్కుల హననం జరుగుతోంది. పది మంది దోషులను విడిచిపెట్టిన సరే.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న న్యాయసూత్రం అమలు కావడం లేదు. ప్రతీ ఒక్కరిలోనూ సోషల్ మీడియా ప్రభావంతో మానవత్వం, కరుణ, సానుభూతిలాంటి పదాలకు అర్థాలు తెలియకుండా పోతున్నాయి. తాము చేసిందే కరెక్ట్.. అన్న భావన ప్రతీ ఒక్కరిలోనూ పెరిగిపోతోంది. శాంతికి స్థానం లేకుండా పోతోంది. సాత్విక ఆలోచన ధోరణి కనమరుగు అయిపోతోంది.

    దేశానికి తాము ఏం చేశాం అన్న వారు కాకుండా దేశం తమకు ఏమిచ్చిందనే వారే ఎక్కువ అవుతున్నారు. తమ దేశ రక్షణకు తాము ఏం చేస్తాం.. ప్రపంచ రక్షణకు తాము ఏం చేస్తామోనన్న దానిపై ఓ క్లారిటీ ఉండడం లేదు. కరుణ, కారుణ్యాలు, పోరాట తత్వం మాయమైపోతున్నాయి. పబ్బులు, క్లబ్బులు, మితీమిరిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, విలాస జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. ప్రపంచం ఎటుపోతున్నా ఫర్వాలేదు తాము బాగుంటే చాలు.. అనే ధోరణి పెరిగిపోతోంది. ఇది అన్ని దేశాల్లో ఉంది. అలాగే అమెరికాలాంటి ప్రజాస్వామ్య దేశంలో మరింత ఎక్కువైంది.

    తాజాగా ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై మీరేం పరిష్కారం చెపుతారని అమెరికాలోని 18-24ఏండ్ల మధ్యలో ఉన్న యువతరాన్ని  ఓ సర్వే సంస్థ ప్రశ్నించింది. దీనికి 51శాతం మంది ఇజ్రాయిల్ అనే దేశాన్ని ప్రపంచ పటం నుంచి తీసివేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. 32 శాతం మంది మాత్రం రెండు దేశాలు ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.

    దీన్ని బట్టి అమెరికన్ యువతలో ప్రపంచ శాంతి, హక్కులు, దేశ రక్షణ లాంటి విషయాలపై అవగాహన, ఆసక్తి పోయిందని తెలుస్తోంది. విలాసవంత జీవితాలకు ఆలవాటుపడి, తమ వ్యక్తిగత సౌకర్యమే తప్ప మిగతా జనాల గోడు పట్టించుకునే ఆలోచనే వారు చేయడం లేదని సర్వే ద్వారా తెలుస్తోంది. అమెరికన్ యువతలో ఈ పెడధోరణి.. ఆ దేశ భవిష్యత్ కు మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    NRI Ratha Saptami : అమెరికాలో ‘ఆదిత్యుడి’ సేవ.. రథసప్తమి వేడుకల్లో  ఎన్ఆర్ఐలు!

    NRI Ratha Saptami Celebrations: భూమిపై సకల జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే...

    ATA-Meditation : ఆటా ఆధ్వర్యంలో ధ్యానంపై సదస్సు…హాజరైన ప్రముఖులు

        అమెరికా తెలుగు సంఘం  18వ మహాసభల నిర్వాహక బృందం ఆధ్వర్యంలో మానసిక...

    TLCA : టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు

    తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు...