అమెరికా తెలుగు సంఘం 18వ మహాసభల నిర్వాహక బృందం ఆధ్వర్యంలో మానసిక వికాసానికి దోహద పడే విధంగా “హేర్త్ఫుల్నెస్స్” సంస్థ సహకారంతో “హేర్త్ఫుల్నెస్స్ ంఎదితతిఒన్” పేరిట ధ్యానంపై సద స్సు నిర్వహించారు. పలు రంగాల నిపుణులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధ్యానము యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు.
ఆటా 18వ కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం “హేర్త్ఫుల్నెస్స్ ంఎదితతిఒన్” బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మనోభారాన్ని తగ్గిస్తూ మనోవికాసానికి తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, కాన్ఫరెన్స్ కో- డైరెక్టర్ శ్రీరామ్, కాన్ఫరెన్స్ కమిటీ చైర్స్ అనుపమ సుబ్బగారి, శ్రావణి రాచకుళ్ల, ఉదయ ఈటూరు, నీతు, నిరంజన్ పొద్దుటూరి, సందీప్ రెడ్డి, జనార్ధన్ పన్నెల, కాన్ఫరెన్స్ కో- చైర్లు మాధవి దాస్యం, మహేష్ కొప్పు, రాజేష్ చప్పరపు, శ్రీనివాస్ కుక్కడపు, అనిల్ కుష్ణపల్లి, సభ్యులు రవీందర్ దాసరపు, కనక లక్ష్మి దాసరపు, శైలజ కుష్నపల్లి తదితరులు పాల్గొన్నారు.