34.1 C
India
Saturday, May 18, 2024
More

    Shivaji Remuneration : రెమ్యునరేషన్ విషయంలో వెనక్కు తగ్గని శివాజీ.. ఎంత తీసుకున్నాడంటే?

    Date:

    Shivaji Remuneration
    Shivaji Remuneration

    Shivaji Remuneration : రియాలిటీ షోలలో తెలుగు బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లో కంటే తెలుగులో బాగా పాపులర్ అయిన షో ఇది. ఈ షోపై విమర్శలు వస్తున్నా సీజన్ కో ట్యాగ్ లైన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. బిగ్ బాస్ సీజన్-7 ముగింపునకు వచ్చింది. చివరి ఎపిసోడ్ ఆదివారం (డిసెంబర్ 17) ప్రసారం కానుంది. ఈ సీజన్ హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో 14 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇక మిగిలిన ఆరుగరిలో హీరో శివాజీ కూడా ఉన్నారు. ఇప్పడు అతని పేరు ప్రత్యేకంగా చెప్పేందుకు ఒక కారణం ఉంది.

    ఎవరి రెమ్యునరేషన్ ఎంత?
    ఇప్పడు బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ ఎవరనే దానికన్నా హీరో శివాజీ రెమ్యునరేషన్ ఎంత అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు ముందే రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తారు. సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ శనివారమే జరిగింది. ఇందులో నలుగురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. ముందుగా వీరిలో అంబటి అర్జున్ 6వ స్థానంతో బిగ్ బాస్ హౌస్‌ను వీడాడు. ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. వీరు రూ.15 లక్షలు తీసుకున్నారు. ఇక శివాజీ కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఈయన ఎంత తీసుకున్నాడనే దానిపై చర్చ సాగుతున్నది.

    జాక్ పాట్ కొట్టేశాడా?
    శివాజీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లినా అతనికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే దానిపైనే అందరి దృష్టి పడింది. అతనికి అందరి కంటే ఎక్కువే ఇచ్చారని, అతను జాక్ పాట్ కొట్టారని చర్చించుకుంటున్నారు. వాస్తవానికి శివాజీకి రోజుకు రూ.60 వేలకు పైగా, వారానికి రూ.42 లక్షలు తీసుకున్నాడట. అలా 15 వారాల పాటు హౌస్ లో ఉన్న శివాజీ మొత్తం రూ.63.75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బిగ్ బాస్ వర్గాలు తెలిపాయి. ఇది విజేత కంటే ఎక్కువనే చెప్పాలి.

    విజేతకు ఎంత ఇస్తారు?
    ఈ సీజన్ లో విన్నర్ కు బిగ్ బాస్ నిర్వాహకులు రూ.50 లక్షలు ప్రైజ్ మనీగా ప్రకటించారు. కానీ యావర్ రూ.15 లక్షలు తీసుకోవడంతో మిగిలింది రూ.35 లక్షలే. దీనికితోడు రూ.15 లక్షల గోల్డ్, రూ.12 లక్షల విలువైన కారు ఇవ్వనున్నారు. వీటితో కలిపి విజేతకు రూ.62 లక్షలే వస్తాయి. కానీ హీరో శివాజీ మాత్రం కేవలం కంటెస్టెంట్ గా ఉండి రూ.63.75 లక్షలు తీసుకొని జాక్ పాట్ కొట్టాడని పలువురు చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...

    Pallavi Prashanth : నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్.. టెన్షన్ లో అభిమానులు

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతుబిడ్డ...

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...