- జీవో నంబర్ 1 కొట్టివేసిన న్యాయస్థానం

AP High court dismissed Go No 1 : ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీవో నంబర్1ను ఏపీ ప్రధాన న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పును వెల్లడించనుంది. రోడ్లపై రాజకీయ పార్టీల సభలు, రోడ్ షోలను అడ్డుకునేలా తెచ్చిన ఈ జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. కాగా, ఇది ప్రాథమిక హక్కలు హరించేలా ఉందని శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ జీవో సరికాదని అభిప్రాయపడింది.
తీర్పుపై ప్రతిపక్షాల్లో ఆనందం..
రోడ్లపై సభలు, రోడ్ షోలను కట్టడి చేసేందుకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఈ జీవో నంబర్ 1ను అమల్లోకి తెచ్చింది. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే అంటూ ఆయా పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏప కాంగ్రెస్ నేత వీర వెంకటరుద్రరాజు, మరికొందరు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి పక్షాలను అడ్డుకోవడంలో భాగంగా జగన్ సర్కారు ఈ జీవో తెచ్చిందని కోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
AP High court ఇచ్చిన తీర్పును వైసీపీ మినహా అన్ని పార్టీలు స్వాగతించాయి. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ తీర్పును హర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు సాధించిన విజయంగా అభివర్ణించారు. అత్యంత దుర్మార్గం ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. అప్రజాస్వామిక నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసి ప్రజాస్వామ్యాన్ని బతికించిందన్నారు. రాబోయే రోజుల్లో పాలకులకు ఇదో చెంపపెట్టని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం కనుక సుప్రీం కోర్టుకు వెళ్తే తాము కెవెట్ వేస్తామని చెప్పారు. మూర్ఖంగా తీసుకునే నిర్ణయాలు కోర్టుల్లో నిలవబోవని తెలిపారు.