- ఇక చంద్రబాబు పని అయినట్టేనా..

bring that law : ఏపీలో రాజకీయాలు ఎప్పడు వేడి మీదే ఉంటాయి. టీడీపీ, వైసీపీ మధ్యలో జనసేన ఏదో చోట నిత్యం ఘర్షణలే. ఇక ఈ పార్టీల ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు పొద్దున లేస్తే మొదలెట్టే బూతుపురణం అంతా ఇంతా కాదు. వీరి మాటలు వింటుంటే అసలు రాజకీయాలు మరీ ఇంతలా దిగజారి పోయాయా అనిపిస్తుంది. దేశంలోనే అత్యంత ఎక్కువ నీచ రాజకీయాలు ఇక్కడే వినిపిస్తాయని చర్చ కూడా జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇది మరీ ఎక్కువైందనే వాదన వినిపిస్తున్నది. చంద్రబాబు లాంటి ఓ అగ్రనేతను కూడా ఏడిపించే స్థాయిలో వైసీపీ క్రూర రాజకీయ నడిచిందంటే ఇక ఏపీ భవిష్యత్ ఏంటో అర్థమవుతూనే ఉందని పక్క రాష్ర్టాల నేతలు చెబుుతున్నారు.
చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా..
అయితే ప్రతిపక్ష నేతలు సభలు మీటింగులు రోడ్లపై పెట్టకుండా ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ వన్ తెచ్చింది. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రతి పక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని న్యాయస్థానం అభిప్రాయ పడింది. వెంటనే జీవో ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు సభల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఆయన రోడ్డెక్కకుండా మరో జీవో తెస్తామన్నారు. దీంతో అంతా విమర్శలు గుప్పిస్తున్నారు.